RTC Strike | రెండో రోజూ బయటకురాని బస్సులు.. కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
RTC Strike | రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె (RTC Strike) కొనసాగుతున్నది. రెండో రోజూ ఆర్టీసీ (TGS RTC) బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల విషయంలో ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు.
RTC Strike | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె (RTC Strike) కొనసాగుతున్నది. రెండో రోజూ ఆర్టీసీ (TGS RTC) బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల విషయంలో ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. అద్దె బస్సులు, ప్రైవేటు డ్రైవర్లతో కొన్ని బస్సులను నడుపుతున్నప్పటికీ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు వీలైనన్ని ఎక్కువ బస్సులను నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లు, తాత్కాలిక డ్రైవర్లను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. సిబ్బందిని అడ్డుకుంటే పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. బస్టాండుల్లో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు బస్సులను అడ్డుకునేందుకు కార్మికులు బస్టాండ్లలో ఆందోళనలకు దిగుతున్నారు. కాగా, ఆర్టీసీ సమ్మె, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలవ్వడం నేపథ్యంలో గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది.
నేడు క్యాబినెట్ భేటీ..
నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం సీఎం అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానున్నారు. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు గురించి సమావేశంలో చర్చించనున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక, అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీల అభ్యర్థిత్వం, మెట్రో స్వాధీన ప్రక్రియ, నిర్వహణపై చర్చించనున్నారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే..
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మొత్తం 32 డిమాండ్లతో ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. వాటిలో కీలకమైనవి ఇవే..
- ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
- పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ వెంటనే అమలు చేయాలి.
- ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
- ఉచిత బస్సు పథకం కింద నెలకు రావాల్సిన రూ.400 కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి.
- బ్రెడ్ విన్నర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి.
- అద్దె బస్సు డ్రైవర్లను సంస్థలో విలీనం చేయాలి.
- ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి.
- సంస్థ ప్రైవేటీకరణను ఆపివేయాలి.
ఇంకా రోడ్డెక్కని బస్సులు
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె
ఆయా జిల్లాల్లో డిపోలకే పరిమితమైన బస్సులు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిపోల వద్ద భారీ బందోబస్తు
హైదరాబాద్‌లోని మియాపూర్ డిపో-2 నుంచి ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం యధావిధిగా నడుస్తుండటం ప్రయాణికులకు కొంత… pic.twitter.com/bNnV0UUaSl
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



