Little Child Dead | అయ్యే పాపం.. బంగారం షాప్‌లో సైనైడ్ తిని చిన్నారి మృతి
Little Child Dead | తన రెండేళ్ల చిన్నారిని చంకనేసుకొని బంగారం కొందామని ఆ మహిళ జ్యువెళ్లరి షాప్‌కు వెళ్లింది. వెళ్తూ వెళ్తూ చిన్నారితో ముద్దు మురిపెం ఒలికిస్తూ దుకాణంలోకి అడుగు పెట్టింది.
- చికిత్స పొందుతూ మృతి.. ఆలస్యంగా వెలుగులోకి
Little Child Dead | త్రినేత్ర న్యూస్: తన రెండేళ్ల చిన్నారిని చంకనేసుకొని బంగారం కొందామని ఆ మహిళ జ్యువెళ్లరి షాప్‌కు వెళ్లింది. వెళ్తూ వెళ్తూ చిన్నారితో ముద్దు మురిపెం ఒలికిస్తూ దుకాణంలోకి అడుగు పెట్టింది. తన పేగు బంధానికి అదే చివరి రోజవుతుందని ఊహించలేకపోయింది. పొరపాటున సైనైడ్ తిన్న ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జీడిమెట్ల ఠాణా పరిధి చింతల్‌లో ఈనెల 7న జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ చింతల్‌కు చెందిన ఓ మహిళ బంగారం కొందామని విష్ణు జ్యువెళ్లరి షాప్‌కు వెళ్లింది. ఆమె బంగారం ఎంపికలో నిమగ్నమైంది. దీంతో చిన్నారి ఏం చేస్తుందనేది గమనించలేదు. ఇంతలో అక్కడే టేబుల్‌పై ఉన్న సైనైడ్ (బంగారం మెరుగుపెట్టడానికి ఉపయోగించేది) తీసుకొన్న ఆ చిన్నారి దాన్ని తినేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయింది. తమకు న్యాయం చేయాలంటూ బంగారం దుకాణం ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ సదరు జ్యువెల్లరీ ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడలు వంచుడే ఇగ
అక్టోబర్ 10, 2026

RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..
అక్టోబర్ 10, 2026

Special Trains | సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ మార్గంలో 34 ప్రత్యేకరైళ్లు
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●Moringa Farming | మహారాష్ట్ర రైతు మాస్టర్ ప్లాన్.. మునగ ఆకులతో నెలకు రూ.12 లక్షల ఆదాయం..
- ●Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడలు వంచుడే ఇగ
- ●Supreme Court lawyers | సీఈసీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన న్యాయవాదులు అరెస్ట్.. ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్
- ●Tummala Nageswara Rao | ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
- ●Rahul Gandhi | జ్ఞానేశ్ కుమార్ వెళ్లిపోతారు.. మోదీ ప్రభుత్వం కూడా పోతుంది : రాహుల్ గాంధీ
- ●RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..

Moringa Farming | మహారాష్ట్ర రైతు మాస్టర్ ప్లాన్.. మునగ ఆకులతో నెలకు రూ.12 లక్షల ఆదాయం..

Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడలు వంచుడే ఇగ

Supreme Court lawyers | సీఈసీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన న్యాయవాదులు అరెస్ట్.. ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్

Tummala Nageswara Rao | ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు



