Moringa Farming | మహారాష్ట్ర రైతు మాస్టర్ ప్లాన్.. మునగ ఆకులతో నెలకు రూ.12 లక్షల ఆదాయం..
Moringa Farming | మహారాష్ట్రకు చెందిన ఓ రైతు మునగ సాగును విలువ ఆధారిత వ్యాపారంగా మార్చి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. మునగ ఆకులను సౌర, విద్యుత్ డ్రైయర్లతో ప్రాసెస్ చేసి పొడిగా తయారు చేస్తున్న మహేష్ కదమ్.. నెలకు దాదాపు ఒక టన్ను మునగ పొడిని ఉత్పత్తి చేస్తున్నాడు. కిలో మునగ పొడిని రూ.1,200కు విక్రయిస్తున్నట్లు మీడియాకు చెప్పాడు.
Moringa Farming | మహారాష్ట్రకు చెందిన ఓ రైతు మునగ సాగును విలువ ఆధారిత వ్యాపారంగా మార్చి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. మునగ ఆకులను సౌర, విద్యుత్ డ్రైయర్లతో ప్రాసెస్ చేసి పొడిగా తయారు చేస్తున్న మహేష్ కదమ్.. నెలకు దాదాపు ఒక టన్ను మునగ పొడిని ఉత్పత్తి చేస్తున్నాడు. కిలో మునగ పొడిని రూ.1,200కు విక్రయిస్తున్నట్లు మీడియాకు చెప్పాడు. అహిల్యానగర్‌కు చెందిన మహేష్ కదమ్.. మూలా ఎడ్యుకేషన్ సొసైటీలో బోధనేతర ఉద్యోగం చేస్తున్నాడు. అతని కుటుంబం తరతరాలుగా చెరకు, ఉల్లిని సాగు చేస్తోంది. అయితే ఈ పంటల నుంచి వచ్చే ఆదాయం స్థిరంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటగా మునగను సాగు చేయాలని తన తండ్రికి సూచించాడు.
ప్రత్యామ్నాయంగా కనిపించిన మునగ..
చెరకు వంటి సంప్రదాయ పంటలు పెట్టుబడి, శ్రమకు తగిన రాబడిని ఇవ్వడం లేదని, సాగునీటి సమస్యలు కూడా పెరుగుతున్నాయని, ఆదాయం కూడా స్థిరంగా ఉండడం లేదని, అందుకే ప్రత్యామ్నాయాల కోసం వెతకడం ప్రారంభించానని కదమ్ తెలిపాడు. మునగ ఆకులు, కాయలకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వాటిపై పెరుగుతున్న ఆసక్తి కదమ్‌ను ఆకర్షించింది. ఆ సమయంలో అహిల్యానగర్‌లో మునగ వాణిజ్య సాగు కూడా పెద్దగా విస్తరించలేదు. మొదట్లో కదమ్ తండ్రి ఈ ఆలోచనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే సోలాపూర్‌లోని మూడు మునగ తోటలను సందర్శించిన తర్వాత మునగ సాగు చేసేందుకు అంగీకరించాడు. కుటుంబం అధిక దిగుబడి, కరువును తట్టుకునే సామర్థ్యం ఉన్న వలయపట్టి రకాన్ని ఎంచుకుంది. తమిళనాడుకు చెందిన ఈ రకం మందంగా, లేతగా, సువాసనతో కూడిన పచ్చని ఆకుల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది.
ఎకరానికి రూ.2 లక్షల వరకు లాభం..
తక్కువ కాలంలోనే కోతకు రావడంతోపాటు దీర్ఘకాలం దిగుబడిని ఇవ్వడం కూడా మునగ సాగు వైపు కదమ్‌ను ఆకర్షించింది. మునగ మొక్కలు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉత్పాదకంగా ఉంటాయని తెలిపాడు. కుటుంబం 2025 జూలైలో మునగను సాగు చేయగా, సెప్టెంబర్‌లోనే తొలి కోత వచ్చింది. మూడు ఎకరాల్లో సాగు చేసిన తొలి పంట నుంచి 6వేల కిలోల తాజా మునగ ఆకులు లభించాయి. వాటిని ప్రాసెస్ చేసిన తర్వాత సుమారు 600 కిలోల ఎండిన ఆకులు వచ్చాయి. ప్రాసెసింగ్ చేయకుండా తాజా మునగ ఆకులుగా విక్రయించినా ఎకరానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం పొందవచ్చని కదమ్ అంచనా వేశాడు. అయితే కేవలం తాజా ఆకులను విక్రయించడం కంటే వాటిని మునగ పొడిగా మార్చడం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చని గుర్తించాడు.
ఆకుల ప్రాసెసింగ్‌తో మరింత ఆదాయం..
మునగ ఆకుల ప్రాసెసింగ్ ప్రారంభించేందుకు కదమ్ మూడు రకాల సౌర డ్రైయర్లను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత హీట్ పంప్ డ్రైయర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. దీని ద్వారా వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పటికీ ఆకులను ఎండబెట్టే అవకాశం లభించింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.29 లక్షలు ఖర్చయ్యాయి. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం కింద సుమారు రూ.10 లక్షల సబ్సిడీ పొందినట్లు కదమ్ తెలిపాడు. అంటే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 35 శాతం సబ్సిడీ రూపంలో లభించింది. మునగ ఆకులను పొడిగా మార్చడం ద్వారా వ్యాపారానికి మరో ఆదాయ మార్గం ఏర్పడింది. కదమ్ కిలో మునగ పొడిని రూ.1,200కు విక్రయిస్తున్నాడు. నెలకు దాదాపు ఒక టన్ను మునగ పొడిని ఉత్పత్తి చేస్తున్నాడు. అంటే ప్రస్తుత విక్రయ ధర ప్రకారం నెలకు సుమారు రూ.12 లక్షల విలువైన మునగ పొడిని విక్రయించే స్థాయికి అతని వ్యాపారం చేరింది. ఇప్పుడు పండ్లు, కూరగాయలను కూడా డీహైడ్రేట్ చేసి విక్రయించే దిశగా కదమ్ అడుగులు వేస్తున్నాడు. మరిన్ని ఉత్పత్తులను వ్యాపారంలోకి తీసుకురావడం ద్వారా ఉత్పత్తుల పరిధిని పెంచడంతోపాటు లాభాల మార్జిన్‌ను మరింత మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
తాజావార్తలు
- ●KTR | పదేండ్ల జిల్లాలు.. ప్రజలందరికీ శుభాకాంక్షలు: కేటీఆర్
- ●India | భారత్ నుంచి సింగపూర్‌కు 3,000 కి.మీ. విద్యుత్ కారిడార్..
- ●Little Child Dead | అయ్యే పాపం.. బంగారం షాప్‌లో సైనైడ్ తిని చిన్నారి మృతి
- ●Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడలు వంచుడే ఇగ
- ●Supreme Court lawyers | సీఈసీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన న్యాయవాదులు అరెస్ట్.. ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్
- ●Tummala Nageswara Rao | ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

KTR | పదేండ్ల జిల్లాలు.. ప్రజలందరికీ శుభాకాంక్షలు: కేటీఆర్

India | భారత్ నుంచి సింగపూర్‌కు 3,000 కి.మీ. విద్యుత్ కారిడార్..

Little Child Dead | అయ్యే పాపం.. బంగారం షాప్‌లో సైనైడ్ తిని చిన్నారి మృతి

Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడలు వంచుడే ఇగ



