త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Three dead in Same Family | సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. బట్ట‌లుత‌క‌డానికి వెళ్లి ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

Three dead in Same Family | ద‌స‌రా పండ‌గ ముందు సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బ‌ట్ట‌లుత‌క‌డానికి వెళ్లిన ముగ్గురు నీటి కుంట‌లో ప‌డి ప్రాణాలు కోల్పోయారు.

S

Telangana | Published On Oct 9, 2026, 2.22 pm IST

Three dead in Same Family | సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. బట్ట‌లుత‌క‌డానికి వెళ్లి ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
Advertisement

Three dead in Same Family | త్రినేత్ర న్యూస్‌: ద‌స‌రా పండ‌గ ముందు సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బ‌ట్ట‌లుత‌క‌డానికి వెళ్లిన ముగ్గురు నీటి కుంట‌లో ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్‌రెడ్డి (42), కృష్ణవేణి (38)గా గుర్తించారు. ఓ చిన్నారి తీవ్ర అస్వస్థ‌త‌కు గుర‌వ‌గా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. మనూరు గ్రామ శివారులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శుక్ర‌వారం బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో ప‌డి మునిగిపోయారు. గ‌మ‌నించిన‌ స్థానికులు వారిని బయటకు తీయ‌గా అప్ప‌టికే న‌ర‌సింహారెడ్డి, సంగ‌మేశ్వ‌ర్‌రెడ్డి మృతి చెందారు. కృష్ణవేణిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ‌స్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. పండ‌గ వేళ ఇలా ఊహించ‌ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డ‌డంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement