Jallikattu | జల్లికట్టు ఆటలో విషాదం.. ముగ్గురి మృతి
Thamilanadu, Jallikattu |తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగంపువారిపల్లి (Simgampuvaripally) లో తాజాగా నిర్వహించిన ఎద్దుల పోటీ పలు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. పోటీ నిర్వహిస్తున్న సమయంలో ఎద్దులు (Bulls) ఒక్కసారిగా అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. కొమ్ములతో దాడి చేయగా తీవ్ర గాయాలపాలైన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
- 14 మంది పరిస్థితి విషమం, 50 మందికిపైగా గాయాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
త్రినేత్ర.న్యూస్: తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు (Jallikattu) ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగంపువారి పల్లి(Simgampuvaripally)లో తాజాగా నిర్వహించిన ఎద్దుల (Bulls) పోటీ పలు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. పోటీ నిర్వహిస్తున్న సమయంలో ఎద్దులు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. కొమ్ముల (Attack) తో దాడి చేయగా తీవ్ర గాయాలపాలైన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 50 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏర్పాట్లపై అనుమానాలు..
జల్లికట్టు సందర్భంగా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని పలువురు మండిపడుతున్నారు. ప్రేక్షకులు బారికేడ్లను దాటి అరేనాలోకి ప్రవేశించడంతో ఏర్పట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2014లో జల్లికట్టు నిషేధంపై..
తమిళనాడులో పొంగల్ పండుగలో భాగంగా మట్టు పొంగల్ రోజున ఈ క్రీడను నిర్వహిస్తారు. సల్లికట్టు, మంజు విరట్టు పేర్లతో కూడా పిలవబడే ఈ క్రీడలో పరుగెత్తే ఎద్దును జనసమూహంలోకి విడిచిపెట్టి, యువకులు దాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే 2014లో సుప్రీంకోర్టు (Supreme court) ఎద్దులను ప్రదర్శన జంతువులుగా ఉపయోగించరాదని స్పష్టం చేస్తూ ఈ ఆటపై నిషేధం విధించింది. జంతువులపై క్రూరత్వం, ప్రజల భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కోర్టును ఆశ్రయించగా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనిమల్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ (FIAPO), పీటా ఇండియా వంటి సంస్థలు కూడా ఈ ఆచారానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి.
ప్రముఖుల మద్దతు..
నిషేధానికి వ్యతిరేకంగా చెన్నై (Chennai) మెరినా బీచ్ వద్ద 2017, జనవరిలో భారీ స్థాయిలో యువత ఆందోళనలు చేపట్టింది. అనామక గుంపుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ (Rally) రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తమిళ సినీ ప్రముఖులు రజనీకాంత్ (Rajanikanth), కమల్ హాసన్ (Kamalhasan), అజిత్ (Ajith), సూర్య (Surya), ధనుష్ (Dhanush) తదితరులు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
కాగా అప్పటి తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం (Pannir Selvam) ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) కలిసి జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడానికి ఆర్డినెన్స్ ముసాయిదా సిద్ధం చేసి కేంద్ర గృహ మంత్రిత్వ శాఖకు పంపింది. చివరగా జనవరి 21న తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్(Ordinance)ను ఆమోదించి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






