Pak Airstrikes | కాబూల్ దవాఖానపై పాక్ వైమానిక దాడులు.. 400 మంది రోగులు మృతి
Pak Airstrikes | అఫ్గానిస్థాన్ ( Afghanistan) రాజధాని కాబూల్‌లోని ఓ దవాఖానపై పాకిస్థాన్ వైమానిక దాడులకు (Pak Airstrikes) తెగబడింది. దీంతో 400 మందికిపైగా మరణించినట్లు అఫ్గాన్ ప్రభుత్వం మంగళవారం తెల్లవారుజామున వెల్లడించింది.
International | Published On Mar 17, 2026, 6.50 am IST
Pak Airstrikes | త్రినేత్ర.న్యూస్: అఫ్గానిస్థాన్ ( Afghanistan) రాజధాని కాబూల్‌లోని ఓ దవాఖానపై పాకిస్థాన్ వైమానిక దాడులకు (Pak Airstrikes) తెగబడింది. దీంతో 400 మందికిపైగా మరణించినట్లు అఫ్గాన్ ప్రభుత్వం మంగళవారం తెల్లవారుజామున వెల్లడించింది. ఈ దాడిలో మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక కాబూల్‌లోని (Kabul) మాదకద్రవ్యాల పునరావాస దవాఖాన (rehab hospital) లక్ష్యంగా దాడులు జరిగాయని ప్రభుత్వ ప్రతినిధి హందుల్లా ఫిట్రాట్ తెలిపారు.

దీంతో హాస్పిటల్‌లో చాలా భాగం ధ్వంసమైందని చెప్పారు. దీనివల్ల ఇప్పటివరకు 400 మంది మరణించారు, 250 మంది గాయపడ్డారని వెల్లడించారు. మంటలను అదుపుచేసేందుకు రెస్క్యూ బృందాలు కృష్టిచేస్తున్నాయని, శిథిలాల నుంచి పలువురి మృతదేహాలను వెలికితీశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

అయితే అంతకుముందు అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ మాట్లాడుతూ ఈ దాడిలో 200 మందికిపైగా మృతిచెందారని చెప్పారు. డ్రగ్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ పూర్తిగా ధ్వంసమైందని వెల్లడించారు. పాకిస్థాన్ మరోసారి అఫ్గాన్ గగనతల నియమాలను ఉల్లంఘించిందని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబూల్‌లోని మాదకద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుంది, మాదక ద్రవ్యాలకు బానిసై చికిత్స పొందుతున్న వారు మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారని చెప్పారు. ఈ నేరాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన దాడిగా పేర్కొన్నారు.

కాగా గత కొన్నిరోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాబూల్‌లోని ప్రాంతాలపై పాక్ దాడులు చేయగా అఫ్గాన్ కూడా ప్రతిదాడులతో తిప్పికొడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాక్ క్షిపణులతో భారీ దాడి చేసినట్లు తెలుస్తున్నది. అయితే తాము హాస్పిటల్‌పై ఎలాంటి దాడులు చేయలేదని పాక్ ప్రకటించింది. కాబుల్, తూర్పు అఫ్గానిస్థాన్‌లో జరిగిన వైమానిక దాడులు ఏ పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించింది. అఫ్గాన్ చేస్తున్న ఆరోపణలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికార ప్రతినిధి మొషర్రఫ్ జైదీ ఖండిచారు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



