త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jaggareddy | స‌దాశివ‌పేట‌లో ఉర్సు ఉత్సవాలు.. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Jaggareddy | సదాశివపేట పట్టణంలోని హజరత్ మహబూబ్ పాశ దర్గా వద్ద జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. గత మూడు రోజులుగా ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

P

Telangana | Published On Apr 18, 2026, 7.02 pm IST

Jaggareddy | స‌దాశివ‌పేట‌లో ఉర్సు ఉత్సవాలు.. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
Advertisement

Jaggareddy | సదాశివపేట పట్టణంలోని హజరత్ మహబూబ్ పాశ దర్గా వద్ద జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. గత మూడు రోజులుగా ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో హజరత్ సయ్యద్ షా మహమ్మద్ సాహెబ్ 422వ ఉర్సే షరీఫ్, హజరత్ మహబూబ్ పాశ 52వ ఉర్సే షరీఫ్ ఉత్సవాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తుండ‌గా.. పెద్ద సంఖ్య‌లో జ‌నం హాజ‌రైన ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కవ్వాలి కార్యక్రమం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక గీతాలతో సాగిన ఈ కార్యక్రమం భక్తి వాతావరణాన్ని మరింతగా పెంచింది. కార్యక్రమ నిర్వాహకులను, దర్గా కమిటీ సభ్యులను జగ్గారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. కవ్వాలి కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా సాగిందని పేర్కొంటూ నిర్వాహకులను ప్రశంసించారు.

Advertisement
Advertisement