త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TOMCOM | తెలంగాణ పిల్ల‌ల‌కు ఓమ‌న్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 73 వేల జీతం.. వివ‌రాలివే..!

TOMCOM | మీరు విదేశాల్లో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా ఇంజినీర్‌గా, డ్రైవ‌ర్‌గా విదేశాల్లో స్థిర‌ప‌డాల‌నుకుంటున్నారా..? నెల‌కు వేల‌ల్లో జీతం సంపాదించాల‌నుకుంటున్నారా..? అయితే ఆల‌స్య‌మెందుకు.. మీ లాంటి వారి కోసం తెలంగాణ టామ్‌కామ్ ఓమ‌న్‌లో ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తోంది.

S

Telangana | Published On Apr 30, 2026, 6.21 pm IST

TOMCOM | తెలంగాణ పిల్ల‌ల‌కు ఓమ‌న్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 73 వేల జీతం.. వివ‌రాలివే..!
Advertisement

TOMCOM | త్రినేత్ర‌.న్యూస్ : మీరు విదేశాల్లో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా ఇంజినీర్‌గా, డ్రైవ‌ర్‌గా విదేశాల్లో స్థిర‌ప‌డాల‌నుకుంటున్నారా..? నెల‌కు వేల‌ల్లో జీతం సంపాదించాల‌నుకుంటున్నారా..? అయితే ఆల‌స్య‌మెందుకు.. మీ లాంటి వారి కోసం తెలంగాణ టామ్‌కామ్ ఓమ‌న్‌లో ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తోంది. అర్హ‌త‌లు, జీతం వంటి త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకుందాం.

అందుబాటులో ఉన్న ఉద్యోగాలు:

1. అగ్రికల్చరల్ ఇంజినీర్
2. ల్యాండ్‌స్కేప్ ఇంజినీర్
3. హెవీ వెహికల్ డ్రైవర్
4. అగ్రికల్చరల్ మెషినరీ డ్రైవర్

అర్హతలు:

SSC / బ్యాచిలర్ డిగ్రీ (పోస్టుకు అనుగుణంగా)
వయస్సు : గరిష్టం 33 సంవత్సరాలు
సంబంధిత పని అనుభవం తప్పనిసరి

జీతం:

రూ. 61,000 - రూ. 73,000 నెలకు
(250 – 300 OMR వరకు)

ప్రయోజనాలు:

ఉచిత వసతి
రవాణా సౌకర్యం
విద్యుత్ & నీరు ఉచితం

లాంగ్వేజ్:

హిందీ / ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం

tomcom.resume@gmail.com అనే వెబ్‌సైట్‌కు బ‌యోడేటా పంపండి

సంప్రదించాల్సిన ఫోన్ నంబ‌ర్లు :

+91 94400 51285
+91 94400 51452

Advertisement
Advertisement