త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhupalapally | భూపాల‌ప‌ల్లి జిల్లాలో విషాదం.. వ్య‌వ‌సాయ బావిలో ప‌డి ముగ్గురు మృతి

Bhupalapally | జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మొగుళ్ల‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని కొరికిశాల గ్రామంలో విషాదం నెల‌కొంది. ఓ ముగ్గురు వ్య‌క్తులు వ్య‌వ‌సాయ బావిలో ప‌డి ప్రాణాలు కోల్పోయారు. మ‌రో వ్య‌క్తికి తీవ్ర గాయాలు కాగా, ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

S

Telangana | Published On Mar 14, 2026, 4.56 pm IST

Bhupalapally | భూపాల‌ప‌ల్లి జిల్లాలో విషాదం.. వ్య‌వ‌సాయ బావిలో ప‌డి ముగ్గురు మృతి
Advertisement

Bhupalapally | త్రినేత్ర‌.న్యూస్ : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మొగుళ్ల‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని కొరికిశాల గ్రామంలో విషాదం నెల‌కొంది. ఓ ముగ్గురు వ్య‌క్తులు వ్య‌వ‌సాయ బావిలో ప‌డి ప్రాణాలు కోల్పోయారు. మ‌రో వ్య‌క్తికి తీవ్ర గాయాలు కాగా, ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

కొరికిశాల గ్రామ స‌మీపంలో ఉన్న ఓ వ్య‌వ‌సాయ బావిలో పూడిక తీసేందుకు క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఇక క్రేన్ స‌హాయంతో పూడిక తీస్తున్న క్ర‌మంలో అది ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డిపోయింది. క్రేన్‌లో ఉన్న న‌లుగురు వ్య‌క్తులు బావిలో ప‌డిపోయారు. దీంతో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను దేవ‌రావు(48), పైడి(53), అభిలాష్‌(16)గా గుర్తించారు. క్ష‌త‌గాత్రుడిని సుకిన మోహ‌న్ రావు అని పేర్కొన్నారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మోహ‌న్ రావు ప‌రిస్థితి విషమంగా ఉంది.

Advertisement
Advertisement