Rangareddy | ఇస్తాం చెరువులో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి
Rangareddy | మండుటెండలకు సేద తీరుదామని ఈతకు వెళ్లిన ఓ ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
Rangareddy | త్రినేత్ర.న్యూస్ : మండుటెండలకు సేద తీరుదామని ఈతకు వెళ్లిన ఓ ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గండిపేట మండల పరిధిలోని ఇస్తాం చెరువులోకి ఓ ముగ్గురు యువకులు సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. చెరువులో ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆ ముగ్గురు కూడా మునిగిపోయారు. ముగ్గురి మృతదేహాలు నీటిపై తేలియాడాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. మృతులను ఇబ్రహీంబాగ్‌కు చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేశ్ (25)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






