త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIT | తేలుస్తారా? నానుస్తారా?

న‌ల్లగొండ‌కు చెందిన మంత్రి మ‌రో మ‌హిళా ఐఏఎస్‌తో స‌న్నిహిత సంబంధం ఉందంటూ ఎన్టీవీ చాన‌ల్‌లో నాలుగైదు రోజుల క్రితం ఓ క‌థ‌నం ప్ర‌సార‌మైంది. ఆ త‌ర్వాత అదే క‌థ‌నాన్ని కొన్ని యూట్యూబ్ చాన‌ళ్లు, డిజిట‌ల్ వెబ్‌సైట్లు అద‌న‌పు వ్యాఖ్యానాల‌తో తిరిగి ప్ర‌సారం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీవ్రంగా స్పందించి నేరుగా డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డిని క‌లిశారు. స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు

a

News | Published On Jan 13, 2026, 4.53 pm IST

SIT | తేలుస్తారా? నానుస్తారా?

సంక్షిప్త సారాంశం

ఓ మంత్రి-మ‌హిళా ఐఏఎస్ కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవ‌ల దుమారం రేపిన ఓ మీడియా క‌థ‌నంపై ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు పూనుకున్న‌ది. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేశ్‌రంజ‌న్ ఫిర్యాదు మేర‌కు హైద‌రాబాద్ సెంట్ర‌ల్ క్రైం స్టేష‌న్‌లో ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేశారు. వెంట‌నే ఈ కేసుపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి.. 8 మంది పోలీసు అధికారుల‌తో స్పెష‌ల్ ఇన్విస్టిగేష‌న్ టీం (సిట్‌)ను ఏర్పాటు చేశారు.

Advertisement

మంత్రి-ఐఏఎస్ క‌థ‌నంపై
సిట్ విచార‌ణ బృందం ఏర్పాటు
ఎన్టీవీ యాజ‌మాన్యం,
రిపోర్ట‌ర్లు, ఎడిట‌ర్లు, యాంక‌ర్ల‌పై కేసు న‌మోదు
మ‌రో 8 న్యూస్ చాన‌ళ్ల‌పై కేసులు

త్రినేత్ర‌.న్యూస్: ఓ మంత్రి-మ‌హిళా ఐఏఎస్ కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవ‌ల దుమారం రేపిన ఓ మీడియా క‌థ‌నంపై ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు పూనుకున్న‌ది. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేశ్‌రంజ‌న్ ఫిర్యాదు మేర‌కు హైద‌రాబాద్ సెంట్ర‌ల్ క్రైం స్టేష‌న్‌లో ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేశారు. వెంట‌నే ఈ కేసుపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి.. 8 మంది పోలీసు అధికారుల‌తో స్పెష‌ల్ ఇన్విస్టిగేష‌న్ టీం (సిట్‌)ను ఏర్పాటు చేశారు.

సీపీ స‌జ్జ‌నార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ..

హైద‌రాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత‌, చేవెళ్ళ డీసీపీ యోగేశ్‌ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్‌ కుమార్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సీఐ సెల్‌ ఇన్‌స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్‌ ఎస్సై హరీశ్‌ల‌తో సిట్ బృందం విచార‌ణ చేయ‌నుంది. ఈ విచార‌ణ‌ను హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

జ‌యేశ్ రంజ‌న్ ఫిర్యాదుతో

న‌ల్లగొండ‌కు చెందిన మంత్రి మ‌రో మ‌హిళా ఐఏఎస్‌తో స‌న్నిహిత సంబంధం ఉందంటూ ఎన్టీవీ చాన‌ల్‌లో నాలుగైదు రోజుల క్రితం ఓ క‌థ‌నం ప్ర‌సార‌మైంది. ఆ త‌ర్వాత అదే క‌థ‌నాన్ని కొన్ని యూట్యూబ్ చాన‌ళ్లు, డిజిట‌ల్ వెబ్‌సైట్లు అద‌న‌పు వ్యాఖ్యానాల‌తో తిరిగి ప్ర‌సారం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీవ్రంగా స్పందించి నేరుగా డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డిని క‌లిశారు. స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలోనే సీనియ‌ర్ ఐఏఎస్‌లు రామ‌కృష్ణారావు, జ‌యేశ్ రంజ‌న్‌ల తో కూడిన ఐఏఎస్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ .. ఈ వివాదాస్ప‌ద క‌థ‌నంపై పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి విచార‌ణ కోసం సిట్ ను కూడా నియ‌మించారు.

ఎన్టీవీ, టీ న్యూస్‌ల‌పై

వివాదాస్ప‌ద క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసిన ఎన్టీవీ యాజ‌మాన్యం, రిపోర్ట‌ర్లు, ఎడిట‌ర్లు, న్యూస్ యాంక‌ర్ల‌పై కేసు న‌మోదైంది. ఫిర్యాదులో యూట్యూబ్ లింకును కూడా పేర్కొన్నారు. అలాగే ఇదే క‌థ‌నాన్ని ప్ర‌సారం చేశారంటూ.. టీ న్యూస్ ఇత‌ర డిజిట‌ల్ చాన‌ళ్లైన తెలుగు స్క్రైబ్‌, ఎమ్మార్ మీడియా తెలంగాణ‌, ప్రైమ్ 9 తెలంగాణ‌, టీవీ న్యూస్‌, పీవీటీ న్యూస్ , సిగ్న‌ల్‌టీవీ, వోల్గా టైమ్స్, మిర్ర‌ర్ టీవీ ల‌పై కేసులు న‌మోదు చేశారు.

సీఎం మౌనం దేనికి సంకేతం

ప్ర‌తి విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ‌ళం వినిపించే సీఎం రేవంత్‌రెడ్డి ఈ విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ మౌనం పాటించ‌డంపై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వారం రోజులుగా త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుడిపై వివాదాస్ప‌ద క‌థ‌నం ప్ర‌సార‌మవుతున్నా స్పందించ‌లేదు. పైగా క‌థ‌నం ప్ర‌సారం చేసిన ఎన్టీవీ యాజ‌మాన్యంతో సీఎం రేవంత్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏకంగా ఎన్టీవీ య‌జ‌మాని న‌రేంద్ర చౌద‌రి ఇంటికే వెళ్లిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ సాన్నిహిత్యం నేప‌థ్యంలో అస‌లు ఈ విచార‌ణ నిజాయితీగా జ‌రుగుతుందా? లేక తూతూ మంత్రంగా సాగిస్తారా అన్న సందేహాలు బ‌య‌లుదేరుతున్నాయి.

 

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement