Road Accident | మెదక్, షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు స్నేహితులు, ఓ బట్టల వ్యాపారి మృతి..
Road Accident | త్రినేత్ర.న్యూస్: మెదక్ జిల్లా కొల్చారంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బుధవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు కొల్చారం శివారులో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని బోల్తా పడింది.
Road Accident | త్రినేత్ర.న్యూస్: మెదక్ జిల్లా కొల్చారంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బుధవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు కొల్చారం శివారులో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. దీంతో ఒకరు అక్కడకక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.
బాధితులు మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్ బట్టల దుకాణం యజమాని వనపర్తి రోహిత్ కుమార్, ఎల్లారెడ్డికి చెందిన విజయ్‌గా గుర్తించారు. విజయవాడ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. మంగళవారం అర్ధరాత్రి షాద్‌నగర్-రాయికల్ టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముంద వెళ్తున్న టిప్పర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులను గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పుల్లగుర్ర పురుషోత్తం రెడ్డిగా గుర్తించారు. వీరు ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






