త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalasani Srinivas Yadav | ప్రజాపాలన కాదిది.. సిగ్గులేని ప్ర‌భుత్వం: తలసాని శ్రీనివాస్ యాదవ్

Thalasani Srinivas Yadav | ముమ్మాటికీ ఇది ప్ర‌జాపాల‌న కాద‌ని.. పేద‌లు, బాధితులు ముఖ్య‌మంత్రిని, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎన్ని శాప‌నార్థాలు పెట్టినా ప‌ట్టించుకోని సిగ్గులేని ప్ర‌భుత్వ‌మ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఫైర‌య్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చరిత్ర ఉన్నంతకాలం ఉంటారని కొనియాడారు.

S

Telangana | Published On May 17, 2026, 5.09 pm IST

Thalasani Srinivas Yadav | ప్రజాపాలన కాదిది.. సిగ్గులేని ప్ర‌భుత్వం: తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement
  • ప్ర‌జ‌లు శాప‌న‌ర్థాలు పెట్టినా కాంగ్రెస్ నాయ‌కులు మార‌రు
  • బూతులే సీఎం రేవంత్ ఏకైక మార్గం
  • కేసీఆర్‌ అప్పులు చేసి అభివృద్ధి చేసిండు
  • మ‌రి మీరేం చేశారో చెప్పండి?
  • కాంగ్రెస్ స‌ర్కార్‌పై త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌ ఫైర్‌

Thalasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: ముమ్మాటికీ ఇది ప్ర‌జాపాల‌న కాద‌ని.. పేద‌లు, బాధితులు ముఖ్య‌మంత్రిని, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎన్ని శాప‌నార్థాలు పెట్టినా ప‌ట్టించుకోని సిగ్గులేని ప్ర‌భుత్వ‌మ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఫైర‌య్యారు. హైడ్రా ను తీసుకొచ్చి వేలాది ఇండ్లను కూల్చారని మండిప‌డ్డారు. బూతు మాటలే సీఎం రేవంత్‌రెడ్డి ఏకైక మార్గం అని ఎద్దేవా చేశారు. LB నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆదివారం ఆయ‌న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చరిత్ర ఉన్నంతకాలం ఉంటారని కొనియాడారు.

జూన్ 1 నుంచి స‌భ్య‌త్వ న‌మోదు..

జూన్ 1 నుండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ పద్ధ‌తిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మహిళలకు రాజకీయ అవకాశాలు మరిన్ని పెరుగుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాలలో ప్రజలకు చేసిందేమీ లేదు. పేగులు తీసుకొని మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోళీలు ఆడుతా అని సీఎం రేవంత్‌ అంటాడు. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ఎంతో అనుకువగా ఉండాలి అని హిత‌వు ప‌లికారు.

ప్రజల మన్ననలను పొందితేనే నాయకులుగా ఎదుగుతారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి, సుపరిపాలనతో నాయకులు, కార్యకర్తల గౌరవం పెరిగింది. రైతు బంధు కింద ఏడాదికి ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్.

ఏం చేయ‌కుండానే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయకుండానే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. కేసీఆర్ అప్పులు చేశారని పదే పదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు నోరు పారేసుకుంటున్నారు. కేసీఆర్ అద్భుతమైన సెక్రెటరీయేట్ నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించారు. మరి అప్పులు చేసి మీరేం చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు చెప్పాలి? బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తుంది అని త‌ల‌సాని విమ‌ర్శించారు.

Advertisement
Advertisement