KP Vivekanand | బోగస్ మాటలతో ప్రజలను మోసంచేసే ప్రభుత్వం ఇది: బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద్
KP Vivekanand | రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బోగస్ మాటలతో ప్రజలను మోసంచేసే ప్రభుత్వమని బీఆర్ఎస్ (BRS) విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల (Assembly Winter Session) వేదికగా నిలదీస్తామని చెప్పారు.
ప్రజలను మోసం చేస్తున్న తీరుపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టీకరణ
KP Vivekanand | రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రైతులకు బోనస్ ఇచ్చే ప్రభుత్వం కాదని, బోగస్ మాటలతో ప్రజలను మోసంచేసే ప్రభుత్వమని బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) మండిపడ్డారు. గత రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం తెలంగాణ (Telangana) ప్రజలను మోసం చేసిన తీరును రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల (Assembly Winter Session) వేదికగా ప్రజలకు తెలియజేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీస్తామని చెప్పారు. కొంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేకానంద్ మాట్లాడుతూ అడుగడుగునా వివక్షతకు గురై వలసలకు కేంద్రంగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి, 90 శాతం పనులు పూర్తిచేసినా మిగిలి ఉన్న 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. గత రెండు ఏళ్లలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని, ఒక్క పని కూడా చేయలేదని దుయ్యబట్టారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వంద రోజుల్లో అమలుచేస్తామన్న ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వివేకానంద్ అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల చావులు, ఆటో డ్రైవర్లు, రైతుల ఆత్మహత్యలపై కచ్చితంగా నిలదీస్తామన్నారు. రైతుబంధు పేరును రైతు భరోసాగా మారుస్తూ రూ. పదివేలకు బదులుగా రూ.15 వేల రైతుబంధును ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసాను రెండు పర్యాయాలు ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. వరి ధాన్యంతో పాటు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ బోనస్‌ను సైతం ఎగ్గొట్టిందని ధ్వజమెత్తారు. రైతులకు బోనస్ ఏమోగానీ, బోగస్ మాటలతో గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు.
పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సభ ద్వారానే ప్రశ్నిస్తామని వివేకానంద్ అన్నారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసెంబ్లీ వేదికగానే ప్రశ్నిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులకు నిధులివ్వమని రాజరిక వ్యవస్థలో ఉన్నట్టు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అహంకారంగా మాట్లాడటంపై కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ అశాస్త్రీయంగా ప్రభుత్వం చేసిన విఫలయత్నాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఊకదంపుడు ప్రసంగాలు కాదు ఖచ్చితమైన సమాధానాలు కావాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీల మైకులను కట్ చేయకుండా ప్రజా సమస్యలపై స్పష్టమైన చర్చ జరిగినప్పుడే ప్రభుత్వ పనితీరు ప్రజలకు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. తూతూ మంత్రంగా రెండు, మూడు రోజులు కాదు ప్రతి అంశంపై కులంకుశంగా చర్చించాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



