త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad | చల్లదనం కోసం తలుపు తెరిస్తే.. దొంగ త‌న ప‌ని కానిచ్చేశాడు..

Nizamabad | అస‌లే ఎండ‌లు మండిపోతున్నాయి. ఆపై ఉక్క‌బోత‌. అర్ధ‌రాత్రి దాటినా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టం లేదు. పైగా క‌రెంటు కోత‌. దీంతో చ‌ల్ల‌ద‌నం కోసం త‌లుపులు తెరిస్తే దొంగ‌లు ఇంట్లో ఉన్న‌దంతా ఊడ్చుకుపోయారు.

G

Telangana | Published On May 28, 2026, 9.08 am IST

Nizamabad | చల్లదనం కోసం తలుపు తెరిస్తే.. దొంగ త‌న ప‌ని కానిచ్చేశాడు..
Advertisement

Nizamabad | త్రినేత్ర‌.న్యూస్‌: అస‌లే ఎండ‌లు మండిపోతున్నాయి. ఆపై ఉక్క‌బోత‌. అర్ధ‌రాత్రి దాటినా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టం లేదు. పైగా క‌రెంటు కోత‌. దీంతో చ‌ల్ల‌ద‌నం కోసం త‌లుపులు తెరిస్తే దొంగ‌లు ఇంట్లో ఉన్న‌దంతా ఊడ్చుకుపోయారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ (Nizamabad) ప‌ట్ట‌ణంలో చోటుచేసుకున్న‌ది.

నిజామాబాద్‌లోని పద్మానగర్‌లో అర్ధరాత్రి క‌రెంటు పోయింది. దీంతో చ‌ల్ల‌ద‌నం కోసం పలు కుటుంబాల వారు ఆరుబయట, మ‌రికొంద‌రు ఇండ్ల‌ల్లో తలుపులు తీసి ప‌డుకున్నారు. ఇదే అద‌నుగా భావించిన ఓ దొంగ‌ ముందుగా ఒక ఇంట్లో చొరబడ్డాడు. బీరువాలో దాచిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు.

అనంత‌రం వ‌రుస‌గా మూడిళ్లలో మొత్తం రూ.28 వేలు ఎత్తుకెళ్లాడు. చివరి ఇంట్లో వృద్ధ దంపతులను కత్తితో బెదిరించి.. వారివద్ద ఉన్న డబ్బులు లాక్కెళ్లాడు. వారు కేక‌లు వేయ‌డంతో స్థానికులు వెంబడించినా దుండగుడు దొరకలేదు. స్థానికుల ఫిర్యాదుతో కేసు న‌మోదుచేసిన పోలీసులు.. సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement