త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITDA Bhadrachalam | ప్ర‌ణాళిక‌తో ప‌ని చేశారు.. దేశంలోనే ఉత్త‌మ అధికారిగా నిలిచారు

ITDA Bhadrachalam | భ‌ద్రాచ‌లం ఐటీడీఏ పీవో బి.రాహుల్ త‌న ఉత్త‌మ ప‌నితీరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కించుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గురువారం జరిగిన జాతీయ POs కాన్ఫరెన్స్ లో ఆయ‌న‌కు ఉత్తమ ప్రాజెక్ట్ అధికారిగా అధికారులు అవార్డు అంద‌జేశారు.

S

Telangana | Published On Jun 4, 2026, 4.59 pm IST

ITDA Bhadrachalam | ప్ర‌ణాళిక‌తో ప‌ని చేశారు.. దేశంలోనే ఉత్త‌మ అధికారిగా నిలిచారు
Advertisement

ITDA Bhadrachalam | త్రినేత్ర‌.న్యూస్‌: భ‌ద్రాచ‌లం ఐటీడీఏ పీవో బి.రాహుల్ త‌న ఉత్త‌మ ప‌నితీరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కించుకున్నారు. దేశంలోనే ఉత్త‌మ ప్రాజెక్ట్ అధికారిగా నిలిచి అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గురువారం జరిగిన జాతీయ POs కాన్ఫరెన్స్ లో ఆయ‌న‌కు ఉత్తమ ప్రాజెక్ట్ అధికారిగా అధికారులు అవార్డు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ సెక్రటరీ రంజన చోప్రా రూ. 5 లక్షల ప్రోత్సాహక పురస్కారాన్ని పీలో రాహుల్, ఏపీవో డేవిడ్ రాజ్ లకు అందజేశారు. గిరిజన మ్యూజియం, భద్రగిరి మార్ట్, ఉద్దీపకం, కెరీర్ గైడెన్స్, ఇలవేల్పుల చరిత్ర, క్రీడల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు వారికి ఈ పురస్కారం లభించింది.

కాగా ఇప్పటికే గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా 'బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును, ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా 'బెస్ట్ రూరల్ టూరిజం అవార్డును, ఆదివాసీ ఐక్య వేదిక తర‌ఫున ఆదివాసీ వికాస రత్న బిరుదును రాహుల్ అందుకోవ‌డం విశేషం.

 

Advertisement

తాజావార్తలు

Advertisement