త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | రాష్ట్రాన్ని ఆర్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా మార్చారు

Kishan Reddy | రాష్ట్రాన్ని ఆర్ఆర్ (రేవంత్ రెడ్డి) రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌గా మార్చార‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యం భూముల‌ను అమ్మ‌డ‌మేన‌ని విమ‌ర్శించారు. వ‌క్ఫ్ భూముల‌పై త‌ప్పా అన్ని భూముల‌పై రేవంత్ క‌న్నేశారని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Sep 5, 2026, 5.11 pm IST

Kishan Reddy | రాష్ట్రాన్ని ఆర్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా మార్చారు
Advertisement
  • 60 లక్షల ఎకరాలకు పైగా భూమిని 22ఏ లో పెట్టారు
  • 22ఏ పై ఇంటింటికీ వెళ్లి రేవంత్‌ ప్రభుత్వంపై పోరాటం చేయాలి
  • ఇందిరాపార్క్ దీక్ష‌లో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రాన్ని ఆర్ఆర్ (రేవంత్ రెడ్డి) రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌గా మార్చార‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యం భూముల‌ను అమ్మ‌డ‌మేన‌ని విమ‌ర్శించారు. వ‌క్ఫ్ భూముల‌పై త‌ప్పా అన్ని భూముల‌పై రేవంత్ క‌న్నేశారని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా భూమిని 22ఏ లో పెట్టార‌ని మండిప‌డ్డారు. నిషేధిత భూ సమస్యలపై ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద శ‌నివారం భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ నిప్పులు చెరిగారు. 22ఏ పై ఇంటింటికీ వెళ్లి పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చారు.

మాజీ సీఎం కేసీఆర్‌ మాదిరిగానే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సైతం భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి దోచుకుంటోంది. భూములు దోచుకోవడానికే 22ఏ తీసుకొచ్చారు. 22ఏ కింద తమ భూములు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలా దోచుకుందో అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని స్థిరాస్తి వ్యాపారంగా మార్చారు. అన్ని రకాల అనుమతులు ఉన్న భూములను 22ఏ జాబితాలో పెట్టారు. భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉంది.

ప్ర‌జాస్వామ్యం ఉందా?

రాష్ట్రాన్ని ఆర్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా మార్చారు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం ఉందా? కాంగ్రెస్‌ నాయకులను, అధికారులను హెచ్చరిస్తున్నా. మీరు దోచుకున్న ప్రతి రూపాయి వసూలు చేసి ప్రజలకు పంచుతాం. బీఆర్‌ఎస్‌ మాదిరిగా కాంగ్రెస్‌ కూడా 30 శాతం కమీషన్‌ అడుగుతోంది. కమీషన్ల కోసమే ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టారు. రానున్న రోజుల్లో రేవంత్‌ ప్రభుత్వంపై పోరాటం చేయాలి. 22ఏ లో పెట్టిన పేదల భూములను తొలగించాలి అని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement