త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్ర‌క్రియ జ‌రుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాల‌ను భాగం చేస్తున్నాం

Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్ర‌క్రియ కోసం గుర్తింపు సంఘాల ఎన్నిక‌ల‌తో కార్యాచ‌ర‌ణ కొన‌సాగుతుంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. భవిష్యత్‌లో విలీనం తరువాత ఇబ్బందులు రాకుండా ఉండడానికి తమ ప్రభుత్వం గుర్తింపు సంఘాలను భాగస్వామ్యం చేస్తుంద‌న్నారు.

S

Telangana | Published On Sep 7, 2026, 12.26 pm IST

Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్ర‌క్రియ జ‌రుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాల‌ను భాగం చేస్తున్నాం
Advertisement
  • శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ర‌వాణా మంత్రి పొన్నం సమాధానం

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ విలీన ప్ర‌క్రియ కోసం గుర్తింపు సంఘాల ఎన్నిక‌ల‌తో కార్యాచ‌ర‌ణ కొన‌సాగుతుంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. భవిష్యత్‌లో విలీనం తరువాత ఇబ్బందులు రాకుండా ఉండడానికి తమ ప్రభుత్వం గుర్తింపు సంఘాలను భాగస్వామ్యం చేస్తుంద‌న్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీన‌ చట్టం 2023లో చేయడానికి గత ప్రభుత్వం సెప్టెంబ‌ర్ 29న‌ జీవో ఎంఎస్ 41 ద్వారా అధికారుల కమిటీ ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ అది కార్యాచరణలోకి రాలేదన్నారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా పొన్నం మాట్లాడారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత కార్మిక సంఘాలతో చర్చలు జరిపాం. గుర్తింపు సంఘాల ఎన్నికలు జరిపి అందులో గెలిచిన సంఘంను అధికారుల కమిటీలో వాళ్ళని కలిపి భవిషత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి విలీన ప్రక్రియ గుర్తింపు సంఘ ఎన్నికలతో కార్యాచరణ కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది.

త్వ‌ర‌లో రెండో స్థానానికి పోతున్నం..

రాష్ట్రంలో 10 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో మూడవ స్థానం లో ఉన్నాం. త్వరలో రెండో స్థానానికి పోతున్నాం. గత ప్రభుత్వం రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి సంస్థను నిర్వీర్యం చేశారు. 60 రోజులు సమ్మె చేసిన కార్మికులు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఎన్నికల్లో 40 వేల ఆర్టీసీ కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారని ఆధార బాధ్యతగా విలీనం చేయాలని ప్రకటించారు. ఆర్టీసీ విలీనం చేయడం లేదని రాజ్ భవన్ ముందు నిరసనలు కూడా తెలిపారు.

మేం ఆర్టీసీకి అండగా ఉంటామని ఆనాడే ప్రకటించారు. 2023 డిసెంబరు 7 తేదీ కాబినెట్ ఏర్పడగానే 9వ తేదీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాం. ఇప్పటికీ 350 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయగా 12260 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. 67 నుంచి 89 శాతానికి ఆక్యుపెన్సీ పెరిగింది. లాస్ నుంచి లాభాల్లోకి వచ్చాం. సీసీఎస్ బకాయిలు 1090 కోట్లు ఉండే దాన్ని 930 కోట్లకు తగ్గించాం. పీఎఫ్ బకాయిలు 2138 కోట్ల నుంచి 1700 కోట్లకు తగ్గించాం.

గత ప్రభుత్వం కార్మికుల సొమ్ము వాడుకుంది. 2017 కి సంబధించి 21 శాతం శాతం, 2021కి సంబధించి 11 శాతం పే స్కేల్ మా ప్రభుత్వం అందించింది. 1424 మంది కారుణ్య నియామకాలు చేపట్టడం జరిగింది. 244 మంది శాశ్వతంగా రిమూవ్ అయినా ఉద్యోగులను తిరిగి తీసుకున్నాం. దేశంలో మొదటిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులను చేయడం జరిగింది. ప్రతి బస్సుకు 69,468 రూపాయలను ఈఎంఐ చెల్లిస్తుండగా నెలకు 4 కోట్లు చెలుస్తున్నాం. ఇప్పటివరకు 29.31 కోట్లు చెల్లించాం.

గతంలో 67 శాతం ఉంటే ఇప్పుడు 89 శాతం ఆక్యుపెన్సీ పెరిగింది. 2932 కొత్త బస్సులు కొనుగోలు చేశాం. 1024 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మరో 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కార్మికుల సంక్షేమం సంస్థ పరిరక్షణ మూడు అంశాలను నడుస్తుంది. డ్రైవర్ కండక్టర్లులను సభ ప్రశంసించాలి. రాఖీ పండుగ రోజు కూడా వారి విధుల్లో ఉండి ప్రయాణీకులను తరలించారు.

జూలై నుంచి 11 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నాం..

ప్రమాదాల రేషియో సున్నా మైనస్‌లలో ఉంది. దాదాపు 15 గంటల పాటు డిప్యూటీ సిఎం మంత్రులు అధికారులతో కలిసి 20 సంఘాలు చర్చించాయి. ఆరోజు గుర్తింపు సంఘాల ఎన్నికలు వారి ప్రధాన డిమాండ్. ఆనాటి నిర్ణయం ప్రకారం ఎన్నికల నిర్వహించాలి. ప్రభుత్వంలో విలీనం చేయాలి. 11 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. జూలై నెల నుంచి 11 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం. గుర్తింపు సంఘాల నుంచి అధికారుల కమిటీ ద్వారా విలీనం పూర్తి చేస్తాం. మిగిలిన 29 ఈడీ స్థాయిలో జరుగుతున్నాయి.

ఆనాటి సమావేశంలో ఉన్నాం. కార్మిక సంఘాలను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకుపోయింది. గుర్తింపు సంఘాలను ఎందుకు చేరుస్తున్నామంటే ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తున్నారని అని రాకుండా చేస్తున్నాం. విలీనం అయినా రాష్ట్రాల్లో సమస్యలు వస్తున్నాయి. అందుకే గెలిచిన సంఘాలను కమిటీలో చేరుస్తున్నాం.

2017 నుంచి 2024 మధ్య 13 వేల మంది కార్మికులు రిటైర‌య్యారు. 1150 కోట్లు వారికి ఇవ్వాలి. 8431 కోట్లు ఏరియార్స్ గ్రాట్యుటీ ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులు అధిగమిస్తూ చేస్తున్నాం. రిటైర్డ్ కార్మికుల పట్ల మాకు బాధ్యత ఉంది. వారికి రావాల్సిన అన్ని బకాయిలు తొలగిస్తాం. కార్మికులకు ప్రమాద బీమా కోటి రూపాయలు చేస్తుంది. పేదోడికి ఇల్లు కడుతున్నాం. అవసరమైతే ఆర్టీసీ స్థలం కోసం 200 రేట్లు ప్రభుత్వ స్థలాన్ని ఉపయోగిస్తాం.

ఆర్టీసీ లైఫ్ లైన్

ఫ్యూచర్ సిటీలో బస్ స్టేషన్లో కడతాం. అక్కడ స్థలం తీసుకుంటాం. ఆర్టీసీ దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. మెట్రో, ఆర్టీసీ ఒకే టికెట్ ఉండేలా చేస్తున్నాం. గుర్తింపు సంఘ ఎన్నికల తరువాత భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. పేద ప్రజలకు లైఫ్ లైన్.. దేశంలో ఇండియన్ లైఫ్ లైన్ రైల్వే లాగా ఆర్టీసీ లైఫ్ లైన్. ఆర్టీసీ కి మా ప్రభుత్వంలో రెండు పీఆర్సీ లు ఇచ్చాం.. 5 డీఏలు ఇచ్చాం..పెండింగ్ డీఏలు లేవు. యూనియన్ ఎన్నికలు జరుపుతున్నాం. తరువాత విలీనం ప్రక్రియ పూర్తి చేస్తాం. ఆర్టీసీ విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి.

సర్వీసు నుంచి రిమూవ్ అయిన దాదాపు 244 మంది ఉద్యోగులను ప్రత్యేక ఐఏఎస్ కమిటీ ద్వారా తిరిగి తీసుకోవడం జరిగింది. బ‌స్ స్టేషన్‌లు ఆధునీకరిస్తున్నాం. పెద్దపల్లి, ఏటూరు నాగారం డిపోలు ఇచ్చాం. Srbs &sbt బకాయిలు 513 కోట్ల నుండి 485 కోట్లకు తగ్గించబడ్డాయి. 4538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. 1000 డ్రైవర్, 743 శ్రామిక, పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. వచ్చే నెలలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందివ్వడం జరుగుతుంది. 1500 కండక్టర్ నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియామకాలు చేపట్టాం. 240 డీజిల్ బస్సులు రిటైర్ఫిట్మెంట్ చేస్తున్నాం. ఆర్టీసీ దేశంలో ఉన్నత స్థానంలో ఉంది అంటే క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న డ్రైవర్ కండక్టర్ ల కృషి అభినందనీయం అని పొన్నం వివ‌రించారు.

Advertisement
Advertisement