Liver | లివర్లు మాయం చేస్తున్నారు సార్.. ఎంపీడీవోకు విద్యార్థుల ఫిర్యాదు
Liver | సార్ లివర్లు మాయం చేస్తున్నారంటూ ఓ ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్థానికంగా చర్చానీయాంశమైంది.
Liver | సార్ లివర్లు మాయం చేస్తున్నారంటూ ఓ ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్థానికంగా చర్చానీయాంశమైంది.
అసలేం జరిగిందంటే..?
మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి ఎస్సీ బాలుర వసతి గృహం అది. హాస్టల్ విద్యార్థులకు వారానికో సారి చికెన్ కర్రీతో కూడిన భోజనం వడ్డిస్తారు. అయితే ఆ చికెన్ కర్రీలో ఒక్క లివర్ కూడా లేదు. లివర్లను ఇష్టంగా తినే కొంత మంది విద్యార్థులకు.. హాస్టల్ సిబ్బంది నిర్వాకం తీవ్ర నిరాశను మిగిల్చింది. లివర్లు ఎక్కడ మాయం అవుతున్నాయని ఆ విద్యార్థులకు సందేహం కలిగింది. దీనిపై హాస్టల్ వార్డెన్‌తో పాటు వంట మనషులను నిలదీయగా సమాధానం దాటవేశారు.
చేసేదేమీ లేక ఎంపీడీవో ఫిర్యాదు..
వారానికోసారి వడ్డించే చికెన్ కర్రీలో లివర్ ముక్కలు వేయకుండా మాయం చేస్తున్నారు సార్ అంటూ స్థానిక ఎంపీడీవో బండారు పార్థసారథికి బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమకు చికెన్‌లో లివర్ ముక్కలు వేయకుండా మాయం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హాస్టల్‌కు సంబంధించిన పలువురు విద్యార్థులు ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. మెనూ ప్రకారం సమయానికి భోజనం పెట్టించాలని అందులో పేర్కోన్నారు. దీంతో ఈ వింతైన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత వార్తలు

Manne Krishank | వేం నరేందర్‌రెడ్డి అసైన్డ్ భూములను దోచుకుంటున్నడు.. రేవంత్‌రెడ్డితో పోటీ పడుతున్నడు: మన్నే క్రిశాంక్
మే 19, 2026

May Flower | విరబూసిన ‘మే’ పుష్పం.. కనువిందు చేస్తున్న ‘బ్లడ్ లిల్లీ’
మే 17, 2026

Samsung Solve for Tomorrow | శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో 5వ ఎడిషన్.. విద్యార్థులు రూ.2 కోట్ల వరకు గ్రాంట్లు పొందే చాన్స్..
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



