Etela Rajender | బాధ్యతలను విస్మరించడం వల్లే ప్రమాదం.. అల్వాల్ బాధిత కుటుంబానికి ఈటల పరామర్శ
Etela Rajender | అల్వాల్‌లో విద్యుద్ఘాతం ప్రమాదం బాధిత బాధిత కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున అల్వాల్ టెలికం కాలనీలో విద్యుత్ తీగలు తెగిపడటంతో జరిగిన ప్రమాదంలో సందీప్, ఆయన కుమార్తె రీతిక ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Etela Rajender | అల్వాల్‌లో విద్యుద్ఘాతం ప్రమాదం బాధిత బాధిత కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున అల్వాల్ టెలికం కాలనీలో విద్యుత్ తీగలు తెగిపడటంతో జరిగిన ప్రమాదంలో సందీప్, ఆయన కుమార్తె రీతిక ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అత్యంత విషాదకరమన్నారు. భార్య కళ్లముందే భర్త, కుమార్తె మృతి చెందడం హృదయ విదారక సంఘటనగా అభివర్ణించారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా ట్రిప్ కావాల్సి ఉన్నప్పటికీ గంటన్నర నుంచి రెండు గంటల వరకు ట్రిప్ కాకపోవడం అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. అత్యవసర ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించకపోవడం బాధాకరమన్నారు.
వర్షాకాలానికి ముందే చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ లైన్ల భద్రతను నిర్ధారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఆ బాధ్యతను నిర్వర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ విషాదాన్ని నివారించే అవకాశం ఉండేదని అన్నారు. బాధిత కుటుంబం అనుభవించిన రెండు గంటల వేదన, ఆవేదనను ఎవరూ తీర్చలేరని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సందీప్ కుటుంబానికి ప్రధాన ఆధారమని, ఆయన మృతితో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. అంతేకాకుండా మృతుడి తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం, సంబంధిత శాఖలు అత్యంత సీరియస్‌గా తీసుకుని బాధిత కుటుంబానికి ప్రత్యేక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
సాధారణ ఎక్స్‌గ్రేషియా కంటే ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. మృతి చెందిన సందీప్, రీతిక కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సందీప్ భార్యకు జీవనోపాధి కోసం ప్రభుత్వంలో, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో తగిన ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బొల్లారం డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, వెంకటాపురం నియోజకవర్గ నాయకుడు రెడ్డి, సర్కిల్ సీనియర్ నాయకులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, సంజయ్, రాజిరెడ్డి, మహిళా నాయకులు సుజాత, కరుణ శ్రీతో పాటు అల్వాల్ సర్కిల్ నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!






