త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఆలోచ‌న లేదు: డిప్యూటీ సీఎం

Telangana | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ కాక‌రేపుతోంది. సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ త‌ప్ప‌దంటూ ప్ర‌క‌టిస్తుండ‌గా, ఉప‌ముఖ్య‌మంత్రి (Deputy CM) మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఆలోచ‌నే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

A

Telangana | Published On Jan 22, 2026, 6.27 pm IST

Telangana | జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఆలోచ‌న లేదు: డిప్యూటీ సీఎం
Advertisement

సీఎం ఒక మాట‌.. డిప్యూటీ సీఎం మ‌రో మాట‌..
అంతుచిక్క‌ని కాంగ్రెస్ రాజ‌కీయాలు

Telangana | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ కాక‌రేపుతోంది. ఒక‌వైపు ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy), కొంత మంది మంత్రులు పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ త‌ప్ప‌దంటూ ప్ర‌క‌టిస్తుండ‌గా తాజాగా ఉప‌ముఖ్య‌మంత్రి (Deputy CM) మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఆలోచ‌నే లేద‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం ఒక మాట‌.. డిప్యూటీ సీఎం మ‌రో మాట‌గా తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. దీంతో అధికార కాంగ్రెస్ రాజ‌కీయాలు అంతుచిక్క‌డం లేదు. ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ చిన్న జిల్లాల ర‌ద్దు ఆలోచ‌న త‌మ ప్ర‌భుత్వానికి లేద‌ని చెప్పారు. అది కేవ‌లం దుష్ప్ర‌చారం మాత్ర‌మేన‌ని ఉద్ఘాటించారు.

సింగరేణి టెండర్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా అవ్వలేదన్న భ‌ట్టి.. త‌న‌పై కావాల‌ని త‌ప్పుడు వార్త‌లు, క‌ట్టు క‌థ‌లు రాయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. టెండ‌ర్లు ర‌ద్దు చేశామ‌ని, పార‌ద‌ర్శ‌కంగా చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌ని తెలిపారు. త‌నపై క‌ట్టు క‌థ‌లు ఎవ‌రు రాస్తున్నారు.. ఎవ‌రు రాయిస్తున్నార‌నే అంశాల‌ను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement