PMJ Jewellers | కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో చోరీ.. సీసీటీవీ ఫుటేజీ విడుదల
PMJ Jewellers | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఆదివారం ఉదయం దోపిడీ దొంగలు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఐదుగురు దుండగులు షాపులోకి ప్రవేశించి.. తుపాకులతో బెదిరించి, అందినకాడికి దోచుకున్నారు.
PMJ Jewellers | త్రినేత్ర.న్యూస్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఆదివారం ఉదయం దోపిడీ దొంగలు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఐదుగురు దుండగులు షాపులోకి ప్రవేశించి.. తుపాకులతో బెదిరించి, అందినకాడికి దోచుకున్నారు. నగల దుకాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక చోటకు చేర్చి.. దోపిడీకి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సిబ్బందిపై కాల్పులు జరపడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దోపిడీ అనంతరం ఐదుగురు దొంగలు బయటకు వచ్చి రోడ్డుపై పరుగెత్తారు. చోరీకి పాల్పడిన దృశ్యాలు, దోపిడీ అనంతరం రోడ్డుపై పరుగెత్తిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్.. కరీంనగర్లో పట్టపగలే దొంగల బీభత్సం
జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాపులో తుపాకీలతో లోపలికి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలను దోచుకున్న ఐదుగురు దుండగులు
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
ఘటనా… https://t.co/ybWwuBUXjy pic.twitter.com/gvv1TgLYh5
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



