Jupally Krishna Rao | నీటి సమస్య ఉందన్నది 100 శాతం వాస్తవం
Jupally Krishna Rao | జూరాల కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి నీటి సమస్య ఉందన్నది 100 శాతం నిజమని మంత్రి జూపల్లి కృష్ణారావు అంగీకరించారు. ఈ సమస్యను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
- ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరుతడి పంటలు వేసుకోవాలని చెబుతున్నం
- ఎల్‌నినో వల్ల కరువు వచ్చే ప్రమాదం ఉందని పదే పదే చెప్పాం
- మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్: జూరాల కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి నీటి సమస్య ఉందన్నది 100 శాతం నిజమని మంత్రి జూపల్లి కృష్ణారావు అంగీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా మంత్రులు, జిల్లా అధికారులు, నియోజకవర్గ ఎమ్మెల్యే రైతాంగానికి కరువు పరిస్థితి వచ్చే అవకాశం ఉందని పదేపదే గుర్తు చేశామని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. జూరాల నీళ్లు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న వేళ సోమవారం ఆయన స్పందించారు.
ఎల్ నినో (El Niño) ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే నీటి లభ్యత తగ్గింది. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఇరిగేషన్ శాఖ అధికారుల ప్రణాళిక ప్రకారమే నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్నాం. కేటీఆరేమో ఇవాళ నీళ్లు ఇవ్వలేదని మాట్లాడుతున్నరు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ఆరుతడి (semi-dry) పంటలైన వేరుశనగ, మినుములు, ఆయిల్ పామ్ వంటి వాటిని సాగు చేయాలని రైతులకు వివరించాం అని జూపల్లి వ్యాఖ్యనించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IIT Bombay | విద్యార్థి మృతితో ఐఐటీ బాంబేలో ఉద్రిక్తత.. ప్రొఫెసర్ సస్పెండ్
- ●Danam Nagender Supreme Court | సుప్రీంకోర్టుకు దానం నాగేందర్.. బుధవారం అత్యవసర విచారణకు సీజేఐ గ్రీన్ సిగ్నల్
- ●KTR | జూరాల ఆయకట్టు రైతుల అరెస్టు అత్యంత దుర్మార్గం
- ●itel A300C | రూ.10,999కే ఐటెల్ ఎ300సి ఫోన్.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Amberpet Constable Suicide | అర్ధరాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

IIT Bombay | విద్యార్థి మృతితో ఐఐటీ బాంబేలో ఉద్రిక్తత.. ప్రొఫెసర్ సస్పెండ్

Danam Nagender Supreme Court | సుప్రీంకోర్టుకు దానం నాగేందర్.. బుధవారం అత్యవసర విచారణకు సీజేఐ గ్రీన్ సిగ్నల్

KTR | జూరాల ఆయకట్టు రైతుల అరెస్టు అత్యంత దుర్మార్గం

itel A300C | రూ.10,999కే ఐటెల్ ఎ300సి ఫోన్.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ..





