Tiger | తిప్పేశ్వర్ టు యాదాద్రి.. ఆడ పులి తోడు కోసం మగ పులి వేట
Tiger | సిద్దిపేట - యాదాద్రి జిల్లాల సరిహద్దుల్లో గత రెండు వారాలుగా సంచరిస్తున్న పెద్దపులికి సంబంధించి కీలక విషయాన్ని అటవీ శాఖ గుర్తించింది. కెమెరాల్లో రికార్డు అయిన చిత్రాల ఆధారంగా అది మగ పులి అని తేల్చారు.
Tiger | త్రినేత్ర.న్యూస్ : ఓ పెద్దపులి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలంలో సంచరిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మూగ జీవాలను పొట్టన పెట్టుకుంది. ఆ జీవాల రక్తాన్ని కళ్లారా చూసింది. దీంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఈ పులిని గుర్తించి, బంధించేందుకు అటవీశాఖ అధికారులు శ్రమిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నారు.
అయితే సిద్దిపేట - యాదాద్రి జిల్లాల సరిహద్దుల్లో గత రెండు వారాలుగా సంచరిస్తున్న పెద్దపులికి సంబంధించి కీలక విషయాన్ని అటవీ శాఖ గుర్తించింది. కెమెరాల్లో రికార్డు అయిన చిత్రాల ఆధారంగా అది మగ పులి అని తేల్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అదే సమయంలో పులికి హాని కలగకుండా ట్రాకర్లు, అటవీశాఖ సిబ్బంది చూడాలని పీసీసీఎఫ్ సూచించారు. ఈ పులి విషయంలో తాజా పరిణామాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అటవీశాఖ అరణ్య భవన్‌లో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
తిప్పేశ్వర్ టు యాదాద్రి..
యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల నుంచి బయల్దేరినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. తిప్పేశ్వర్ నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వుకు.. అక్కడ్నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లోకి ప్రవేశించింది.
ఆడ పులి తోడు కోసమే..
మగ పులలు తమ 18 నెలల ఉంచి 3 ఏళ్ల వయసు మధ్య తమ సొంత భూభాగాన్ని వదిలి.. కొత్త భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుంటాయి. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్న పులి వయసు 5 ఏళ్లు అని అధికారులు తేల్చారు. అంతేకాకుండా ఈ మగ పులులు ఆడ పులి కోసం వేటను కొనసాగిస్తాయి. ఆడ పులులు మాత్రం తమ తల్లిదండ్రులను విడిచి ఉండలేవు. ఆడ పులి కోసం వెతుక్కుంటూ వచ్చిన పులినే ఈ మగ పులి.
కెమెరా ట్రాప్‌లు, థర్మల్ డ్రోన్లు..
పులి యొక్క కచ్చితమైన కదలికల కోసం అటవీశాఖ కెమెరా ట్రాప్‌లు, థర్మల్ డ్రోన్లను వినియోగిస్తోంది. ఇస్మాయిపేట, చిన్నలక్ష్మీపురం సమీప ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ట్రాకింగ్ బృందాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. పులి కదలికలపై నిఘా పెట్టాలని, తక్షణమే సమాచారం అందించాలని ప్రజలను అధికారులు కోరారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



