Rajya Sabha | తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ..!
Rajya Sabha | రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ 37 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు.
Rajya Sabha | త్రినేత్ర.న్యూస్ : రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ 37 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. బీఆర్ఎస్ తరపున కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. కేఆర్ సురేశ్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇక కేశవరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆయన రాజ్యసభ పదవీకి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభకు నామినేట్ చేశారు.
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



