Gaddam Prasad | ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను కొట్టివేసిన స్పీకర్
Gaddam Prasad | మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasad) కొట్టివేశారు. కాలే యాదయ్య (Kale Yadaiah), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy)లను బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. వారు పార్టీ మారారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.
ఆ ఇద్దరూ పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవని స్పష్టీకరణ
Gaddam Prasad | త్రినేత్ర.న్యూస్ : మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasad) కొట్టివేశారు. కాలే యాదయ్య (Kale Yadaiah), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy)లను బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. వారు పార్టీ మారారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. గతంలో అయిదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ స్పీకర్ ఇదే తీర్పు ఇచ్చారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి, షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వారిపై సుదీర్ఘ విచారణ అనంతరం గత నెల 17న అయిదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్ అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పు వెలువరించారు. తాజాగా మరో ఇద్దరికి క్లీన్‌చిట్ ఇవ్వడంతో మిగిలిన ముగ్గురి అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ నెలకొంది.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో పాటు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వారికి నోటీసులు జారీ చేసినప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటివరకు స్పీకర్‌ను కలిసి వివరణ ఇవ్వలేదు. మరోవైపు వారిరువురూ పార్టీ మారారనేందుకు ఆధారాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న చివరి పిటిషన్‌పై తీర్పు గురించి అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



