లోడ్ అవుతోంది...


Shambhala OTT | శంబాల మూవీతో దాదాపు పన్నెండేళ్ల తర్వాత హిట్టు అందుకున్నారు టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్. హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంటను పండించింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. సంక్రాంతి సందర్భంగా శంబాల ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ కన్ఫామ్ చేశారు.
జనవరి 22న ఆహా ఓటీటీలో శంబాల మూవీ రిలీజ్ కాబోతుంది. గోల్డ్ సబ్‌స్క్రైబర్లు ఓ రోజు ముందుగానే ఈ సూపర్ హిట్ మూవీని చూడొచ్చని ఆహా ఓటీటీ ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
శంబాల మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో స్వాసిక, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రలు పోషించారు.
డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన శంబాల మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాన్సెప్ట్‌తో పాటు ఆది సాయికుమార్ యాక్టింగ్ బాగున్నాయంటూ కామెంట్స్ వచ్చాయి. దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 25 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆది సాయికుమార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
శంబాల అనే చిన్న పల్లెటూరిలో ఆకాశం నుంచి ఉల్క పడుతుంది. ఆ ఉల్క పడినప్పటి నుంచి ఊరి ప్రజలు ఒకరి తర్వాత మరొకరు చనిపోతుంటారు. ఉల్క వల్లే మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు భయపడతారు. ఆ ఉల్క గురించి పరిశోధన చేయడానికి విక్రమ్ (ఆది సాయికుమార్) అనే సైంటిస్ట్ వస్తాడు. దేవుడిపై విక్రమ్‌కు నమ్మకం ఉండదు. సైన్స్‌ను నమ్ముతుంటాడు. విక్రమ్ పరిశోధనలతో ఆ ఉల్క గురించి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఆ ఊరిని ఆవహించిన భూతం కథేమిటి? ఆ భూతం మిస్టరీని ఛేదించడంలో విక్రమ్‌కు అండగా నిలిచిన దేవి (అర్చనా అయ్యర్) ఎవరు? పురాణాల్లో శివుడు, అంధకాసురుడికి మధ్య జరిగిన యుద్ధానికి ఆ ఊరికి ఉన్న సంబంధమేమిటి? అన్నదే శంబాల కథ.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam