Koppula Eswar | రేవంత్ బావమరిది కోసమే నిబంధనల మార్పు: కొప్పుల ఈశ్వర్
Koppula Eswar | నైని బ్లాక్ టెండర్ల అంశంలో ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) బావమరిది సృజన్ రెడ్డి కోసమే నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆరోపించారు. నైని ఒక్కటే కాదు కాకుండా మొత్తం టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నైనీ బ్లాక్ ఒక్కటే కాకుండా టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్
సింగరేణిని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టీకరణ
సింగరేణి బచావో పేరుతో ఉద్యమం చేస్తామని హెచ్చరిక
Koppula Eswar | త్రినేత్ర.న్యూస్ : నైని బ్లాక్ టెండర్ల అంశంలో ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) బావమరిది సృజన్ రెడ్డి కోసమే నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆరోపించారు. నైని ఒక్కటే కాదు కాకుండా మొత్తం టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి లో జరుగుతున్న బొగ్గు బ్లాక్ ల కుంభకోణంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని అన్నారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో బయట పెట్టడంతో నైని టెండర్లు రద్దు చేశారని, కానీ మిగిలిన బ్లాక్‌ల టెండర్లు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణిని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని, సింగరేణి బచావో పేరుతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై కేంద్రప్రభుత్వం, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు.
సింగరేణి అంటే వేల కుటుంబాల భవిష్యత్తు..
సింగరేణి అంటే ఒక్క బొగ్గు బ్లాక్ కాదని, వేల మంది కుటుంబ సభ్యుల భవిష్యత్తు అని అన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని వాపోయారు. ఒక సింగరేణి కార్మికుడిగా ఆవేదనతో మాట్లాడుతున్నానని చెప్పారు. బొగ్గు బావి పని ఎంతో కష్టంతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. అలాంటి కష్టంతో కూడిన పనిలో రేవంత్ ప్రభుత్వం రూ. ఆరు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. స్వయానా ముఖ్యమంత్రి బావమరిదిని ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈ కుంభకోణం జరిగిందని అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది ముఖ్యమంత్రి బామ్మర్ది మేలు కొరకే పెట్టారని మండిపడ్డారు. రేవంత్ బామ్మర్ది చేసిన బొగ్గు కుంభకోణం అంశంలో యావత్ సింగరేణి శోకిస్తోందన్నారు. సింగరేణి ప్రాంతంలో బుధవారం జరిగిన సైరన్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కబంధ హస్తాల కింది నుంచి సింగరేణిని కాపాడేందుకు పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు.
సింగరేణి సంస్థ నుదోచుకుంటాం అంటే చూస్తూ ఊరుకోం..
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి గురించి ఆలోచన చేశారని గుర్తు చేశారు. బొగ్గు కుంభకోణం బయటపెడితే హరీశ్‌రావును ఆరు గంటలు విచారణ పేరిట ఇబ్బంది పెట్టారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనస్ లలో టెండర్లు జరిగేవని, కానీ ఇప్పుడు ప్లస్ లలో టెండర్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. అంటే కుంభకోణం జరిగినట్లే కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు కుంభకోణం జరిగిందా లేదా జరగకపోతే జరగలేదు అని వివరణ ఇచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఎందుకంటే ఇందులో స్పష్టంగా కుంభకోణం జరిగినట్లు తెలుస్తోందని, అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడడం లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఉద్దేశిస్తూ.. తాము ఆరోపణలు చేయడం లేదని, ఆధారాలతో కుంభకోణం బయటపెట్టామని అన్నారు. హరీశ్‌రావు ఆధారాలు లేకుండా మాట్లాడరని, సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు ఇస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటే..
కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి బుధవారం స్పందిస్తే.. కుంభకోణంపై మాట్లాడతారని, సీబీఐ విచారణ చేయిస్తారని అనుకున్నామని చెప్పారు. అవన్నీ ఏం లేకుండా సీబీఐ విచారణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే చేస్తామని అంటున్నారని వివరించారు. గతంలో కుంభకోణాల ఆరోపణలు వస్తే సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. సింగరేణి అంశంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని, కాబట్టే ఈ విధంగా వ్యవహరిస్తూ విచారణ చేపట్టడం లేదని మండిపడ్డారు. తన బావమరిది అంశంలోనే సీఎం విచారణ చేయాలని కోరుతాడా అని ఎద్దేవా చేశారు. మంత్రుల మధ్య వాటాల పంపిణీ తేడాతోనే కుంభకోణం బయటకు వచ్చిందని కిషన్‌రెడ్డి అంటున్నారని, మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖ అవసరం లేకుండా నేరుగా ఆయనే విచారణకు ఆదేశించవచ్చు కదా అని అన్నారు. కేసీఆర్ హయాంలో తప్పు జరిగితే గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్రానికి సింగరేణిని అప్పజెప్పితే బాగా నడిపిస్తామంటున్నారని, కానీ సింగరేణి బొగ్గు తెలంగాణ రాష్ట్ర సొమ్ము అని స్పష్టం చేశారు. విచారణ చేయాలని తాము కోరుతున్నామని, కేంద్రప్రభుత్వం స్పందిస్తే సంతోషమని, విచారణ జరిపిస్తే హర్షిస్తామన్నారు.
సైట్ విజిట్ నిబంధనతో సింగరేణికి కోట్లల్లో నష్టం: రాజిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకువచ్చిన సైట్ విజిట్ నిబంధనతో సింగరేణికి కోట్లల్లో నష్టం వాటిల్లుతోందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆరోపించారు. ఈ విధానం కోల్ ఇండియాలోనూ అమలు కావడం లేదని గుర్తు చేశారు. ఈ విధానం ఎన్ఎండీసీలో ఉన్నప్పటికీ అందరికీ ఆ సర్టిఫికెట్ ఇస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి లో రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లను ఒక్క సిండికేట్ విధానం తెచ్చిందని మండిపడ్డారు. నైని బొగ్గు బ్లాక్‌లో పెద్ద అవినీతి జరుగుతుందని, దాంతో సింగరేణి నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ డిస్కంల నుంచి రావాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలు రావడం లేదని చెప్పారు. దాదాపు రూ.నాలుగు వేల కోట్ల వడ్డీని సింగరేణి కోల్పోతుందని పేర్కొన్నారు. సేవ్ సింగరేణి బచావో సింగరేణి పేరుతో బుధవారం నిరసనలు వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వ పనులకు సింగరేణి సంస్థ డబ్బులు వాడుకుంటున్నారని, మెస్సీ వస్తే కూడా సింగరేణి సంస్థ సొమ్మును ప్రభుత్వం వినియోగించుకుందని మండిపడ్డారు. శ్రీరాంపూర్ లో జరిగిన డీజల్ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



