త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | క‌ట్టె, కొట్టె, తెచ్చే కేటీఆర్ కుటంబానికే వ‌ర్తిస్తుంది: చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy | క‌ట్టె, కొట్టె, తెచ్చే కేటీఆర్ (KTR) కుటంబానికే వ‌ర్తిస్తుంద‌ని భువ‌న‌గిరి ఎంపీ (MP) చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan) లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై మండిప‌డిన కేటీఆర్‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు.

A

Telangana | Published On Dec 26, 2025, 6.21 pm IST

Chamala Kiran Kumar Reddy | క‌ట్టె, కొట్టె, తెచ్చే కేటీఆర్ కుటంబానికే వ‌ర్తిస్తుంది: చామల కిరణ్ కుమార్ రెడ్డి
Advertisement

Chamala Kiran Kumar Reddy | క‌ట్టె, కొట్టె, తెచ్చే కేటీఆర్ (KTR) కుటంబానికే వ‌ర్తిస్తుంద‌ని భువ‌న‌గిరి ఎంపీ (MP) చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan) లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై మండిప‌డిన కేటీఆర్‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. కేటీఆర్ హైదరాబాద్‌ (Hyderabad) లో తొడలు కొడుతున్నారని, తానూ బూతులు మాట్లాడుతాన‌ని అంటున్నార‌న్న ఆయ‌న‌... నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ (Telangana)ప్రజలను మీరు వచించలేదా అని కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఉద్యమకారుని అవతారం ఎత్తి, పిట్ట కథలు కట్టి, సీఎం పదవిని, అధికారాన్ని కొట్టి రాష్ట్రాన్ని అప్పుల చేసి మీ కుటుంబానికి సంపద తెచ్చారని ఎద్దేవా చేశారు. హైడ్రా (Hydraa) చేస్తున్న పనుల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో నాలాలను కబ్జాలు చేసి ఇళ్ళు కట్టారని, వానాకాలం వస్తే ఇళ్ళన్నీ మునిగి ప్రజలకు ఆస్తి నష్టం జరిగేదని గుర్తు చేశారు. అప్పుడు కాలనీలు, పార్కులను కబ్జాలు చేసి దండుపాళ్యం ముఠాలా దోచుకున్నారని ఆరోపించారు. వాళ్లు కబ్జాలు చేసి దోచుకున్న వాటిని హైడ్రా కూల్చివేస్తుందని చెప్పారు. హైడ్రా ప్రజల కోసం కూల్చివేతలు చేపడుతోందని పేర్కొన్నారు. వాళ్లు గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయని, వారి బాగోతం తెలంగాణ ప్రజలకు చెప్పడానికి దేవుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగడం ద్వారా వారి అవినీతిని బయటపెట్టారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇళ్ళు ప్రజలకు ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమంటే డబ్బులు ఇవ్వడం కాదని, మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవుతార‌ని వివ‌రించారు.

రేవంత్‌రెడ్డిది మెరిట్ కోటా... కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా...

కేటీఆర్ బుద్ది, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయ్యారని చెప్పారు. కేటీఆరే మేనేజ్‌మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చాడ‌ని, అదే కోటాలో సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మంత్రిగా అయ్యార‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా జెడ్పిటీసీగా గెలిచార‌ని అన్నారు. ఒక‌సారి ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి ఇప్పుడు సీఎం అయ్యారని పేర్కొన్నారు. మెరిట్ కోటా, పేమెంట్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా ఎవరిదో తెలంగాణ ప్రజలకు తెలుస‌ని అన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి అయిన తర్వాతనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఎప్పుడు అధికారం త‌మ‌కే ఉంటుందని బీఆర్ఎస్ హయాంలో నియంత పాలన చేశారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడించి ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేతిలో మరొక్క‌సారి ఓటమి తప్పద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

కేటీఆర్ ఐరన్ లెగ్ వర్కింగ్ ప్రెసిడెంట్

బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ ఐర‌న్ లెగ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అని చామ‌ల మండిప‌డ్డారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో తాను ఏదో పొడిచానని చెప్పుకున్న కేటీఆర్‌ను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టారని విమ‌ర్శించారు. కేటీఆర్ పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హిత‌వు ప‌లికారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్రను బీఆర్ఎస్ పోషించాలని సూచించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకుని రావాల‌ని అన్నారు. లేనిప‌క్షంలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను కేటీఆర్ తీసుకుని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు.
క‌ట్టె, కొట్టె, తెచ్చే కేటీఆర్ కుటంబానికే వ‌ర్తిస్తుంద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రేవంత్‌పై మండిప‌డిన కేటీఆర్‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement