Karne Prabhakar | ఐదేళ్ల రేవంత్ సినిమాలో ఇప్పుడు ఇంటర్వెల్ నడుస్తోంది
Karne Prabhakar | ఐదేళ్ల రేవంత్ సినిమాలో రెండున్నరేళ్లు అయిపోయాయని, ఇప్పుడు ఇంటర్వెల్ నడుస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియంతను ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
- ఆయనకు ఎప్పుడూ కేసీఆర్ నామస్మరణే
- పని చేసింది సున్నా
- ఎవరైనా నియంతను స్ఫూర్తిగా తీసుకుంటరా?
- తన మనవడితో ఆడుకోడానికి రూ.10 కోట్లతో ఫుట్‌బాల్ గ్రౌండ్ కట్టుకున్నడు
- మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శలు
Karne Prabhakar | త్రినేత్ర.న్యూస్: ఐదేళ్ల రేవంత్ సినిమాలో రెండున్నరేళ్లు అయిపోయాయని, ఇప్పుడు ఇంటర్వెల్ నడుస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అభూత కల్పనలు, అవాస్తవాలు తప్ప చేసింది ఏం లేదని విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నియంతను ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఏ వార్త వస్తుందో.. రేవంత్ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదని పేర్కొన్నారు.
పేదల జీవితాలపై హైడ్రా పేరుతో బుల్డోజర్ ప్రయోగించిన నేత రేవంత్ రెడ్డి. ఈడీ అమీన్, గడాఫీ, హిట్లర్ బాటలో రేవంత్ ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నారు. అబద్దాల మాటలతో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల కాలం పూర్తయ్యింది. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభూత కల్పనలు, అవాస్తవాలు తప్ప ఒరిగిందేమి లేదు. శంకుస్థాపనలు తప్ప భవనాలు ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు అని ప్రభాకర్ విమర్శించారు.
రూ.100 కోట్లతో గెస్ట్ హౌస్ కట్టుకున్నడు..
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో 100 కోట్లతో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. తన మనవడితో ఆడుకోవడానికి రూ.10 కోట్లతో ఫుట్‌బాల్ గ్రౌండ్ కట్టుకున్నారు. శంకుస్థాపనలు జరిగిన భవనాలు, ప్రాజెక్టులు పూర్తవుతాయని నమ్మకం లేదు. ఏ వేదికల మీద అయినా కేసీఆర్ నామ స్మరణ తప్ప వేరే ఏ పని చేయడం లేదు. 95 వేల కోట్లతో కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి 2 లక్షల 92 వేల కోట్ల దాకా తీసుకెళ్లారు. రేవంత్ మాటలు తప్ప చేసింది సున్నా అని ఆయన ధ్వజమెత్తారు.
అభివృద్ధి చేస్తారన్న నమ్మకమైతే లేదు..
కేసీఆర్,కేటీఆర్, హరీశ్‌రావులపై వ్యక్తిగత విమర్శలు చేయడానికే రేవంత్‌రెడ్డికి సరిపోతుంది. కేసీఆర్ చావును పదేపదే కోరుకుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మిగతా రెండున్నరేళ్లలో ఏదో చేస్తారన్న నమ్మకం ఎవరికీ లేదు. కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్ని ఆలోచించే కేసీఆర్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్‌ను సోర్స్‌గా నిర్ణయించారు అని కర్నె ప్రభాకర్ గుర్తు చేశారు.
ఫ్యూచర్ సిటీ కాదు.. ఫేక్ సిటీ..
రేవంత్ రెడ్డి మాత్రం నీళ్లు లేని జూరాల చుట్టూ తిరుగుతున్నారు. కమీషన్ల కోసమే సాధ్యం కాని ప్రజలకు ఉపయోగం లేని ప్రాజెక్టుల గురించి రేవంత్ ఆలోచిస్తున్నారు. రేవంత్‌కే ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు. అది ఫ్యూచర్ సిటీ కాదు..ఫేక్ సిటీ. ఫ్యూచర్ సిటీ నిలబడేది కాదు. ఫార్మా సిటీ కోసం 13 వేల ఎకరాలు సేకరిస్తే దాన్ని ఫ్యూచర్ సిటీ కోసం ఎట్లా వాడుతారు? అని మాజీ ఎమ్మెల్సీ నిలదీశారు.
పెట్టుబడిదారుల్లో భయం..
గతంలో హైడ్రాను భగవత్‌గీత స్ఫూర్తితో ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు హిట్లర్ కోర్ టీం పేరుతో హైడ్రా పేరు పెట్టమంటున్నారు. నియంతను ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటారా? ఢిల్లీ నుంచి ఎప్పుడు ఏ వార్త వస్తుందో.. రేవంత్ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు. మూసీ పునరుజ్జీవం పేరిట ప్రజల బతుకులను ఆగం చేస్తున్నాడు. హైదరాబాద్ అభివృద్ధిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పెట్టుబడి పెట్టే వారిలో రేవంత్ మాటలతో భయం ఏర్పడుతోంది. ఇకనైనా రేవంత్ తన పద్ధతులు మార్చుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అని కర్నె ప్రభాకర్ హితవు పలికారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద రూ. 110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క
జూన్ 8, 2026

Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
జూన్ 8, 2026

Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
- ●Peddi | మరో వివాదంలో పెద్ది - అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల డిమాండ్
- ●Airtel | ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలను సమర్థించుకున్న ఎయిర్ టెల్.. నిబంధనల ఉల్లంఘన లేదని స్పష్టీకరణ..
- ●Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!
- ●Dasoju Sravan Kumar | తెలంగాణ జనాక్రోశమే ఈ కవిత్వం.. సీఎం రేవంత్‌కు అంకితం
- ●N Ramachander Rao | హిట్లర్ లాగే రేవంత్ ప్రభుత్వానికి మరణం తప్పదు : ఎన్ రామచందర్ రావు

Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

Peddi | మరో వివాదంలో పెద్ది - అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల డిమాండ్

Airtel | ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలను సమర్థించుకున్న ఎయిర్ టెల్.. నిబంధనల ఉల్లంఘన లేదని స్పష్టీకరణ..

Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!



