త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | సినిమా టికెట్ రేట్ల పెంపు నాకు తెలిసే జరిగింది: కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy | త్రినేత్ర‌.న్యూస్ : సినిమా టికెట్ రేట్ల పెంపు (Cinema Ticket Price Hike) త‌న‌కు తెలిసే జ‌రిగింద‌ని రోడ్లు, భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) స్ప‌ష్టం చేశారు. పెరిగిన సినిమా టికెట్ల ధ‌ర‌ల‌కు త‌న‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసి ఒక రోజు గ‌డ‌వ‌గానే మంత్రి మాట మార్చేశారు.

A

Telangana | Published On Jan 12, 2026, 4.05 pm IST

Komatireddy Venkat Reddy | సినిమా టికెట్ రేట్ల పెంపు నాకు తెలిసే జరిగింది: కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి
Advertisement

ఒక రోజులోనే మాట మార్చిన మంత్రి

Komatireddy Venkat Reddy | త్రినేత్ర‌.న్యూస్ : సినిమా టికెట్ రేట్ల పెంపు (Cinema Ticket Price Hike) త‌న‌కు తెలిసే జ‌రిగింద‌ని రోడ్లు, భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) స్ప‌ష్టం చేశారు. పెరిగిన సినిమా టికెట్ల ధ‌ర‌ల‌కు త‌న‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసి ఒక రోజు గ‌డ‌వ‌గానే మంత్రి మాట మార్చేశారు. మంత్రి తాజాగా సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ గ‌తంలో ఒక దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌పుడు అసెంబ్లీ వేదిక‌గా బెనిఫిట్ షోలకు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని తాను, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్ర‌క‌టించామని చెప్పారు. కానీ దీనిపై తాము కూర్చుని మాట్లాడుకుని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు.

టికెట్ ధ‌ర‌లు పెంచితే ఇర‌వై శాతం సినీ కార్మికుల‌కు ఇవ్వాల‌నే ష‌ర‌తుపై పెంచామ‌ని చెప్పారు. గ‌తంలో కొన్ని సినిమాల‌కు పెంచ‌గా కోర్టు అభ్యంత‌రం చెప్పిందన్నారు. ఆ స‌మ‌యంలో తాను న‌గ‌రంలో లేనని, మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాను న‌ల్లగొండ‌, భువ‌నగిరి జిల్లాల‌కు తానే బాధ్యుడిగా ఉండ‌డంతో ఆ జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నాన‌ని వివ‌రించారు. సీనియ‌ర్ అయినా, జూనియ‌ర్ అయినా ఇత‌ర శాఖ‌ల్లో ముఖ్య‌మంత్రి జోక్యం చేసుకోర‌ని స్ప‌ష్టం చేశారు. సంబంధిత శాఖ మంత్రి తీసుకునేదే ఫైన‌ల్ నిర్ణ‌యమ‌ని అన్నారు.

మంత్రిగారిని చూస్తే జాలేస్తుంది అన్న హ‌రీశ్‌రావు వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ర్కారా స‌ర్క‌స్ కంపెనీయా అని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జమెత్తారు. వారికి స‌మాధాన‌మిచ్చేంత స‌మ‌యం త‌మ‌కు లేదు.. వారికి ప‌ని లేదని మండిప‌డ్డారు. హ‌రీశ్‌రావును చూస్తేనే జాలేస్తుందని, ప‌దేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఎంపీ సీటు కూడా గెల‌వ‌లేదని గుర్తు చేశారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో 20 శాతం గెల‌వ‌లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement