త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | 18న మేడారంలో కేబినెట్ స‌మావేశం ?

Telangana | తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని (Cabinet Meeting) ఈ నెల 18న నిర్వ‌హించ‌నుండ‌గా, దానిని సంప్రదాయానికి భిన్నంగా మేడారం (Medaram)లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల భోగ‌ట్టా. 18న రాత్రి ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మేడారంలోనే బ‌స చేయ‌నున్న‌ట్లు తెలిసింది.

A

Telangana | Published On Jan 12, 2026, 5.30 pm IST

Telangana | 18న మేడారంలో కేబినెట్ స‌మావేశం ?
Advertisement

Telangana | తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని (Cabinet Meeting) ఈ నెల 18న నిర్వ‌హించ‌నుండ‌గా, దానిని సంప్రదాయానికి భిన్నంగా మేడారం (Medaram)లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల భోగ‌ట్టా. 18న ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభకు హాజ‌రైన అనంత‌రం మేడారం చేరుకోనున్న ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy).. ఆ రోజు రాత్రి మేడారంలోనే బ‌స చేయ‌నున్న‌ట్లు తెలిసింది. 19న ఉద‌యం స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ల గ‌ద్దెల‌కు నూత‌నంగా నిర్మించిన ప్రాంగ‌ణాల‌ను ప్రారంభించి, తొలి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. అనంత‌రం హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చి, సాయంత్రం దావోస్‌కు ప్ర‌యాణం కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారికంగా విడుద‌ల కావాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement