త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | కంచే చేను మేసిన‌ట్లుగా సీఎం, ప్ర‌భుత్వ పెద్దల వ్య‌వ‌హారం : ఎమ్మెల్సీ దాసోజు

Dasoju Sravan | కంచే చేను మేసినట్టుగా సీఎం, కొందరు ప్రభుత్వం పెద్దలు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. సినీ పరిశ్రమపై జులుం చేస్తూ విచ్చలవిడిగా అవినీతి కి పాల్ప‌డుతున్నార‌ని, ప్రతి దాంట్లో కమిషన్లు దండుకోవడం పరిపాటిగా మారింద‌ని విమ‌ర్శించారు.

P

Telangana | Published On Jan 12, 2026, 5.13 pm IST

Dasoju Sravan | కంచే చేను మేసిన‌ట్లుగా సీఎం, ప్ర‌భుత్వ పెద్దల వ్య‌వ‌హారం : ఎమ్మెల్సీ దాసోజు
Advertisement

Dasoju Sravan | కంచే చేను మేసినట్టుగా సీఎం, కొందరు ప్రభుత్వం పెద్దలు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. సినీ పరిశ్రమపై జులుం చేస్తూ విచ్చలవిడిగా అవినీతి కి పాల్ప‌డుతున్నార‌ని, ప్రతి దాంట్లో కమిషన్లు దండుకోవడం పరిపాటిగా మారింద‌ని విమ‌ర్శించారు. ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ప్రదర్శనలు కలెక్టర్ పరిధిలో ఉంటాయ‌న్నారు, నచ్చిన వారికి నజరానా, నచ్చని వారికి జరిమానా అనేది ఈ ప్రభుత్వ వైఖరిగా ఉంద‌ని ఆరోపించారు. ఒక్కో సినిమాకు ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి జీవోలు విడుదల చేస్తున్నార‌ని, సినిమాటోగ్రఫీ నుంచి కాకుండా హోంశాఖ నుంచి టిక్కెట్ల ధరల పెంపు జీవోలు వ‌స్తున్నాయ‌ని విమ‌ర్శించారు.

సీఎంవో ఒత్తిళ్ల‌తోనే జీవోలు వ‌స్తున్నాయ‌న్నారు. త‌మ పార్టీ నేత హ‌రీశ్‌రావు ఇదే విష‌యంపై కోమ‌టిరెడ్డిని ప్ర‌శ్నించార‌ని, సీఎంవో నుంచి నిర్ణయాలు ఎలా వస్తున్నాయని హ‌రీశ్‌రావు రావు ప్రశ్నిస్తే త‌ప్పేముంద‌న్నారు. హ‌రీశ్ రావు నిజాలు మాట్లాడితే ఈ అంశంపై కూడా కాంగ్రెస్ నేతలు మాటల దాడులు చేయడం దుర్మార్గమంటూ మండిప‌డ్డారు. తనకు తెలియకుండా సినిమా టిక్కెట్ల పెంపు నిర్ణయం తీసుకుంటున్నార‌ని స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే చెప్పార‌ని, ఆయ‌న ప్రెస్‌మీట్ త‌ర్వాత హ‌రీశ్‌రావు స్పందించార‌ని గుర్తు చేశారు. శాఖ మంత్రికి సంబంధం లేకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని హ‌రీశ్‌రావు అన్న‌ది నిజ‌మా? కాదా? అని నిల‌దీశారు.

త‌ప్పిదం, అవినీతిని ప్ర‌శ్నించ‌గానే కోమ‌టిరెడ్డి మాట‌మార్చార‌న్నారు. ముందు తనకు కమిషన్లు రాలేదని కోమటి రెడ్డి తన శాఖ కు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి ప్రెస్‌మీట్ నిర్వ‌హించార‌ని, తర్వాత తన వాటా రాగానే కోమటి రెడ్డి మాట మార్చినట్టు స్పష్టంగా అర్థ‌మ‌వుతోంద‌న్నారు. రాష్ట్రంలో పాలన ఎలా నడుస్తుందో దీన్ని బట్టి అర్థ‌మ‌వుతుంద‌న్నారు. ఇది ఏం ప్ర‌భుత్వం..? రాష్ట్రంలో ప్రభుత్వం కూరగాయల షాప్ నడుపుతుందా ? పాలన చేస్తుందా ? అంటూ ఘాటుగా ప్ర‌శ్నించారు. హీరో ప్రభాస్ పెద్దమ్మ మ‌ళ్లీ వ‌చ్చేది కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే అంటే రాజాసాబ్ సినిమాపై క‌క్ష గ‌ట్టార‌ని, జీవో ఇచ్చిన‌ట్టే ఇచ్చి హైకోర్టు స్టే ఇచ్చేలా చేశార‌న్నారు. ఒక్కో హీరోకు ఒక్కో న్యాయమా ? అని నిల‌దీశారు. నేను కుర్చీలో ఉన్నంత కాలం టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వనని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి రెండు భాషల్లో చెప్పార‌ని, ఇప్పుడు ఏ క‌మిష‌న్లు వ‌చ్చాయ‌ని టిక్కెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తున్నావ్ రేవంత్ రెడ్డి ? అంటూ ప్ర‌శ్నించారు.

సీఎం సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరు చూసి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా కోమటి రెడ్డి వెంకట రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. సినిమా థియేటర్లలో దోపిడీ జరుగుతుంటే సీఎం, మంత్రి ఏం చేస్తున్నార‌ని, దలకు సినిమా చూసే అవకాశం కూడా ఈ ప్రభుత్వం కల్పించదా ? అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎంని నిలదీయకుండా కోమటిరెడ్డి.. హ‌రీశ్‌రావును ప్రశ్నిస్తారా ? అని ప్ర‌శ్నించారు. హోంశాఖని అడ్డం పెట్టుకొని సీఎం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నార‌ని, ప్రజలు అన్నీ గమనిస్తున్నార‌ని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement