E Challans | పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు.. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
E Challans | రాష్ట్రంలోని వాహనదారులను ఊరట కలిగించే విధంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంతం పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులను కోర్టు ఆదేశించింది.
E Challans | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని వాహనదారులను ఊరట కలిగించే విధంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంతం పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులను కోర్టు ఆదేశించింది. రోడ్లపై ఎక్కడంటే అక్కడ వాహనాలను చలాన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. బైక్ కీస్ లాక్కోవడం సమంజసం కాదని కోర్టు హెచ్చరించింది. వాహనాలను ఆపడం కూడా సరికాదని కోర్టు పేర్కొంది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే.. పోలీసులు వసూలు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. ఒక వాహనదారులు చలాన్లు చెల్లించేందుకు నిరాకరిస్తే.. చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.
ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. రోడ్లపై వాహనాలను ఆపి పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





