Harish Rao | హరీశ్‌రావు సిట్ విచారణ @ 7 గంటలు
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో హరీశ్‌రావును దాదాపు 7 గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా విచారించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో హరీశ్‌రావును దాదాపు 7 గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా విచారించారు. సిట్ అధికారులు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి కలిసి హరీశ్‌రావును విచారించారు.
హరీశ్‌రావు విచారణ ముగిసేంత వరకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఆయన మద్దతుదారులు జూబ్లీహిల్స్ పీఎస్ వద్దనే ఉండి.. సంఘీభావం ప్రకటించారు. ఇక హరీశ్‌రావు పీఎస్ నుంచి బయటకు రాగానే జై బీఆర్ఎస్, జై హరీశ్‌రావు అంటూ గులాబీ కేడర్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక జూబ్లీహిల్స్ నుంచి హరీశ్‌రావు నేరుగా తెలంగాణ భవన్‌కు బయల్దేరి వెళ్లారు.
హరీశ్‌రావు విచారణ సాగిందిలా..
మంగళవారం ఉదయం ప్రారంభమైన హరీశ్‌రావు విచారణ మధ్యాహ్నం వరకు మూడు గంటల పాటు కొనసాగింది. అధికారులు సిద్ధం చేసుకున్న ప్రశ్నల జాబితాతో హరీశ్‌రావును విచారించినట్లు సమాచారం. 3 గంటల విచారణ అనంతరం ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని పీఎస్‌లోనే హరీశ్‌రావు ముగించారు. భోజన విరామం అనంతరం మళ్లీ విచారణ కొనసాగింది. దాదాపు 4 గంటలకు పైగా రెండో సెషన్‌లో విచారణ జరిగింది. అంటే దాదాపు ఏడు గంటల పాటు హరీశ్‌రావును సుదీర్ఘంగా విచారించారు.
మంగళవారం ఉదయం కోకాపేట్‌లోని తన నివాసం వద్ద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడి.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే ఉద్దేశపూర్వకంగా తనకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే తనపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా విచారణ ఏంటని హరీశ్‌రావు నిలదీశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



