Reliance Industries | రూ.10 కోట్ల నుంచి రూ.12.5 లక్షల కోట్లకు.. అంబానీల అద్భుత ప్రస్థానం..
Reliance Industries | ధీరూభాయ్ అంబానీ 1977లో ప్రారంభించిన రిలయన్స్ స్టాక్ మార్కెట్ ప్రయాణం.. ఆయన మనవడు ఆకాష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్‌తో మరో కీలక మైలురాయిని చేరుకుంది. రూ.10 కోట్ల మార్కెట్ విలువతో మొదలైన ప్రస్థానం.. నేడు రూ.12.5 లక్షల కోట్ల స్థాయికి చేరడం భారత కార్పొరేట్ చరిత్రలోనే సంచలనంగా నిలిచింది.
Reliance Industries | ధీరూభాయ్ అంబానీ 1977లో ప్రారంభించిన రిలయన్స్ స్టాక్ మార్కెట్ ప్రయాణం.. ఆయన మనవడు ఆకాష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్‌తో మరో కీలక మైలురాయిని చేరుకుంది. రూ.10 కోట్ల మార్కెట్ విలువతో మొదలైన ప్రస్థానం.. నేడు రూ.12.5 లక్షల కోట్ల స్థాయికి చేరడం భారత కార్పొరేట్ చరిత్రలోనే సంచలనంగా నిలిచింది.
చరిత్ర సృష్టించిన అంబానీలు..
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అంబానీ కుటుంబం మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. బుధవారం జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బీఎస్ఈలో రూ.1,358 వద్ద లిస్ట్ అయ్యాయి. ఐపీఓ ధర రూ.1,119తో పోలిస్తే ఇది 21.3 శాతం ప్రీమియం. దీంతో సుమారు రూ.12.5 లక్షల కోట్ల మార్కెట్ విలువతో జియో దేశంలోనే రెండో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానంలో నిలిచిన జియో.. భారతీ ఎయిర్‌టెల్‌ను అధిగమించింది. 1977 నవంబర్‌లో రిలయన్స్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ ఐపీఓతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. దాదాపు ఐదు దశాబ్దాల్లో అద్భుతమైన వృద్ధికి నిదర్శనంగా నిలిచింది. ఆ ఐపీఓ ఏడు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ కాగా, 1978 జనవరి 23న రిలయన్స్ షేర్లు బీఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. అప్పట్లో రూ.10 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ 1988 జూన్ నాటికి రూ.3,026 కోట్లకు చేరింది. 1997 మార్చి నాటికి రూ.14,395 కోట్లకు పెరిగింది. 1993-94 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా రూ.10 వేల కోట్ల మార్కెట్ విలువను అధిగమించింది.

రిలయన్స్ ఆవిర్భావం ఇలా..
రిలయన్స్ అసలు పేరు 1973లో మైనైలాన్ లిమిటెడ్. ఆ తర్వాత రిలయన్స్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్‌గా, 1985 జూన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌గా మారింది. తొలినాళ్లలో వస్త్రాలు, పాలిస్టర్ రంగాలపై దృష్టి పెట్టిన సంస్థ.. ఆ తర్వాత చమురు అన్వేషణ, పెట్రోలియం శుద్ధి, పెట్రోకెమికల్స్, అధునాతన పదార్థాలు, పునరుత్పాదక ఇంధనం, రిటైల్, డిజిటల్ సేవలు, మీడియా రంగాలకు విస్తరించింది. ప్రారంభ ఐపీఓలో రూ.10 ముఖ విలువతో షేర్లు జారీ చేయగా, రూ.1వేయి పెట్టుబడితో 100 షేర్లు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఆరు బోనస్ ఇష్యూల కారణంగా అదనపు పెట్టుబడి లేకుండానే ఆ షేర్ల సంఖ్య 4,096కు పెరిగేది. ఇప్పుడు జియో ప్లాట్‌ఫామ్స్ ఈ విస్తరణలో మరో కీలక అధ్యాయంగా నిలిచింది. కంపెనీ ఐపీఓ ద్వారా సుమారు రూ.30,200 కోట్లు సమీకరించింది. దీనికి రూ.7 లక్షల కోట్లకుపైగా డిమాండ్ వచ్చింది. ప్రారంభమైన 100 నిమిషాల్లోనే ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది.
10 నిమిషాల్లోనే ఐపీవోకు దరఖాస్తులు పూర్తి..
అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారుల వాటా తొలి 10 నిమిషాల్లోనే పూర్తిగా నిండింది. మూడో రోజు ముగిసే సమయానికి మొత్తం ఐపీఓ 22.2 రెట్లు, సంస్థాగత పెట్టుబడిదారుల వాటా 70.55 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రిటైల్, తొలిసారి పెట్టుబడులు పెట్టేవారితో కలిపి 1.38 కోట్లకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐపీఓలో 27 కోట్ల కొత్త షేర్లను మాత్రమే జారీ చేశారు. వాటాల విక్రయం ద్వారా వచ్చే మొత్తంలో రూ.27,500 కోట్లను రుణాల చెల్లింపు లేదా ముందస్తు చెల్లింపులకు వినియోగించనున్నారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించారు.

పెట్టుబడిదారుల నమ్మకాన్ని కొనసాగిస్తాం: ఇషా అంబానీ
లిస్టింగ్ కార్యక్రమంలో జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. సామాన్య భారతీయులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ధీరూభాయ్ అంబానీ ఆశయాన్ని ఈ లిస్టింగ్ కొనసాగిస్తోందన్నారు. రిలయన్స్‌ను కొద్దిమంది సంపన్న పెట్టుబడిదారులకే పరిమితం చేయకుండా ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నది తన తాత నిర్ణయమని, దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆ విశ్వాసం మరోసారి సాకారమైందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు తమ భవిష్యత్తులో కొంత భాగాన్ని అంబానీ కుటుంబం తదుపరి తరానికి అప్పగించారని, ఆ నమ్మకాన్ని కృతజ్ఞతతో, వినయంతో, బాధ్యతతో స్వీకరిస్తున్నామని తెలిపారు.
2016లో మొదలై అంచెలంచెలుగా..
2016లో అందుబాటు ధరల్లో మొబైల్ డేటాను అందిస్తూ జియో ప్రారంభించిన డిజిటల్ విప్లవం.. ఇప్పుడు 53.3 కోట్లకుపైగా వినియోగదారులకు చేరింది. వైర్‌లెస్ సేవలతోపాటు ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్, ఎయిర్‌ఫైబర్, క్లౌడ్ కంప్యూటింగ్, వ్యాపార కమ్యూనికేషన్లు, అనుసంధాన పరికరాలు, వినోదం, కృత్రిమ మేధ వంటి రంగాల్లోనూ సంస్థ విస్తరిస్తోంది. అయితే ఇంత భారీ వినియోగదారుల సంఖ్యను అధిక ఆదాయంగా మార్చుకోవడం జియో ముందున్న ప్రధాన సవాలు. నోమురా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎలారా సెక్యూరిటీస్ సంస్థలు లిస్టింగ్ రోజునే జియో షేర్లపై కొనుగోలు సిఫారసులు చేశాయి. వీటి లక్ష్య ధరలు రూ.1,340 నుంచి రూ.1,367 మధ్య ఉన్నాయి. టారిఫ్ పెంపులు, కొత్త చందాదారుల చేరిక, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ, 5జి సేవల ద్వారా ఆదాయం, మూలధన వ్యయాల నియంత్రణ, డిజిటల్ సేవల విస్తరణ భవిష్యత్తు వృద్ధికి కీలకమని బ్రోకరేజీలు అంచనా వేశాయి.
20 శాతం వార్షిక వృద్ధికి చాన్స్..
ఎలారా అంచనా ప్రకారం 2026-27 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్య డిజిటల్ సేవల ఆదాయం సగటున ఏటా 23 శాతం, ఎబిట్డా సుమారు 36 శాతం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 2.7 కోట్ల నుంచి 6.6 కోట్లకు పెరిగే చాన్స్ ఉందని అంచనా. 2027 మార్చి నుంచి సుమారు 15 శాతం టారిఫ్ పెంపు ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ భావిస్తోంది. 2026-27 నుంచి 2028-29 మధ్య జియో ఆదాయం, ఎబిట్డా, లాభాలు వరుసగా 14 శాతం, 15 శాతం, 20 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఇదే కాలంలో ఎబిట్డా ఏటా 13.5 శాతం పెరిగి, 2028-29 నాటికి సంస్థ నికర నగదు నిల్వల స్థాయికి చేరుతుందని నోమురా పేర్కొంది.

దేశానికి సేవ చేయాలన్నదే లక్ష్యం: ఆకాష్ అంబానీ
జియో ఏడాదికి సుమారు 15.5 బిలియన్ డాలర్ల ఆదాయం, 8 బిలియన్ డాలర్ల వాస్తవ ఆదాయాన్ని సాధించిందని ఇషా అంబానీ తెలిపారు. కేవలం పదేళ్లలో ఇంతటి స్థాయికి చేరుకోవడం ప్రపంచంలోనే అరుదైన విషయమన్నారు. వినియోగదారులకు నిజమైన విలువను సృష్టిస్తే బలమైన ఆదాయాలు వాటంతట అవే వస్తాయన్న ముకేష్ అంబానీ సూత్రంతోనే జియో నిర్మాణం జరిగిందని వివరించారు. అనంతరం మాట్లాడిన ఆకాష్ అంబానీ.. దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో జియోను నిర్మించామని, ఐపీఓ కొత్త ఆరంభమని పేర్కొన్నారు. తొలి పదేళ్లలో డేటాను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చామని, తదుపరి దశలో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, అనుసంధాన పరికరాలు, అంతరిక్షం నుంచి అందించే కనెక్టివిటీ వంటి సాంకేతికతలను ప్రజాస్వామ్యీకరించడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఒకప్పుడు వస్త్ర వ్యాపార సంస్థగా ప్రారంభమైన రిలయన్స్.. నేడు భారత మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న డిజిటల్, సాంకేతిక సేవల సామ్రాజ్యంగా విస్తరించింది. ధీరూభాయ్ అంబానీ కాలంలో రూ.10 కోట్లతో మొదలైన ప్రస్థానం.. ఆకాష్ అంబానీ నేతృత్వంలోని జియో లిస్టింగ్‌తో రూ.12.5 లక్షల కోట్ల స్థాయికి చేరింది. ఇది గత ఐదు దశాబ్దాల సంపద సృష్టి చరిత్ర మాత్రమే కాదు.. రాబోయే దశాబ్దంలో డిజిటల్ సాంకేతికతలపై అంబానీ కుటుంబం పెట్టుకున్న భారీ ఆశలకు కూడా ప్రతీకగా నిలుస్తోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Koyyala Ruth John Paul | ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసిన మొదటి ట్రాన్స్ మహిళ
- ●T20 Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ జోరు.. టెస్టుల్లో యాన్సెన్ చరిత్ర
- ●High Speed Trains Collide | రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 46 మంది మృతి
- ●BELలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా
- ●Samsung Galaxy A08 | రూ.18,499కే శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ పెళ్లిపై మళ్లీ రూమర్స్.. డిసెంబర్లోనే అంటూ ప్రచారం..!

Koyyala Ruth John Paul | ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసిన మొదటి ట్రాన్స్ మహిళ

T20 Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ జోరు.. టెస్టుల్లో యాన్సెన్ చరిత్ర

High Speed Trains Collide | రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 46 మంది మృతి

BELలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా






