త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ ప్ర‌తిపాదిస్తున్న అంశాల జాబితా స్పీక‌ర్‌కు అంద‌జేత‌

Telangana Assembly | తెలంగాణ శాస‌న‌స‌భ (Telangana Assembly) శీతాకాల స‌మావేశాల (Winter Session) సంద‌ర్భంగా అసెంబ్లీలో ప‌దిహేను అంశాల‌పై చ‌ర్చించాల‌ని బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భా ప‌క్షం ప్ర‌తిపాదించింది. ఈ జాబితాను బీఆర్ఎస్ శాస‌న‌స‌భ్యులు స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్‌కు అంద‌జేశారు.

A

Telangana | Published On Dec 29, 2025, 5.08 pm IST

Telangana Assembly | అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ ప్ర‌తిపాదిస్తున్న అంశాల జాబితా స్పీక‌ర్‌కు అంద‌జేత‌
Advertisement

Telangana Assembly | తెలంగాణ శాస‌న‌స‌భ (Telangana Assembly) శీతాకాల స‌మావేశాల (Winter Session) సంద‌ర్భంగా అసెంబ్లీలో ప‌దిహేను అంశాల‌పై చ‌ర్చించాల‌ని బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భా ప‌క్షం ప్ర‌తిపాదించింది. ఈ మేర‌కు బీఏసీ (BAC) స‌మావేశంలో బీఆర్ఎస్ శాస‌న‌స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. దీనితో పాటు శాస‌న‌స‌భ‌ను ప‌దిహేను రోజులు స‌మావేశ‌ప‌రచాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై స్పీక‌ర్ స్పందిస్తూ ముందుగా వారం రోజుల పాటు స‌మావేశాలు నిర్వ‌హించుకుందామ‌ని, ఆ త‌రువాత తిరిగి బీఏసీ స‌మావేశం నిర్వ‌హించి అప్పుడు చ‌ర్చిద్దామ‌ని స్ప‌ష్టం చేశారు. అనంత‌రం బీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్షం ప్ర‌తిపాదిస్తున్న అంశాల జాబితాను బీఆర్ఎస్ శాస‌న‌స‌భ్యులు స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్‌కు అంద‌జేశారు.

శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీ చర్చకు ప్రతిపాదిస్తున్న అంశాలు:

1) రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు - యూరియా కొరత, రుణ మాఫీ, పంట బోనస్, పెండింగ్ బకాయిలు, రైతు భరోసా, రైతు ఆత్మహత్యలు
2) వందరోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు రెండేళ్ల పాలన పూర్తయినా అమలు కాని తీరు - అన్ని వర్గాలకు జరిగిన మోసాలు
3) ఫార్మా సిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల ధారాదత్తం
4) కొత్త థ‌ర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెచ్చిన పాలసీలో జరిగిన అవినీతి
5) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ తప్పిదాలు
6) నిరుద్యోగులకు జాబ్ కేలండర్ ప్రకారం ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం
7) ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి - ఐదు డీఏలు, పీఆర్‌సీ చెల్లింపులో జాప్యం, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల విడుదలలో నిర్లక్ష్యం
8) పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం - 45 టీఎంసీలు చాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన తీరు
9) హిల్ట్ పాలసీ తో ఐదు లక్షల కోట్ల కుంభకోణం - ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెడుతున్న తీరు
10) గురుకులాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం - 126 కి పైగా విద్యార్థుల మరణాలు
11) గ్రేటర్ హైదరాబాద్‌లో 22 మున్సిపాలిటీల విలీనం - అశాస్త్రీయంగా జరిగిన విలీన ప్రక్రియ
12) హైడ్రా విపరీత పోకడలు - పేదల ఇళ్ల పై ప్రతాపం - బుల్డోజర్ పాలన
13) ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్పుతో రైతులకు జరుగుతున్న ఇబ్బందులు - రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న ప్రభుత్వ విధానం
14) రాష్ట్రం లో పెరుగుతున్న నేరాలు - శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం
15) ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపును పెండింగ్‌లో పెట్టడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలు

Advertisement

తాజావార్తలు

Advertisement