TGSRTC | త్రినేత్ర.న్యూస్ : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రభుత్వం ఉద్యోగం( Govt Job ) కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు( Un Employees ).. టీజీఎస్ఆర్టీసీ( TGSRTC ) శుభవార్త వినిపించింది. ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ( Traffic Supervisor Trainee )(85), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ( Mechanical Supervisor Trainee )(114) పోస్టులను భర్తీ చేయనుంది టీజీఎస్ఆర్టీసీ. ఈ నియామకాల ప్రక్రియ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు( TSLPRB ) ద్వారా కొనసాగనుంది. ఈ మేరకు టీఎస్ఎల్పీఆర్‌బీ గురువారం అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హతలు ఇవే.. ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా డిగ్రీ పాసై ఉండాలి. మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు ఆటో మొబైల్( Auto Mobile )(డిప్లొమా) లేదా మెకానికల్ ఇంజినీరింగ్( Mechanical Engineering ) పూర్తి చేసి ఉండాలి. జీతం ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు జీతం వచ్చేసి రూ. 27080 నుంచి రూ. 81400 వరకు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..? ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 30 నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ తేదీల మధ్యలో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు స్థానికులకు రూ. 400 కాగా, ఇతరులకు రూ. 800. వయోపరిమితి ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేండ్లు సడలించారు. ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. ప్రస్తుతం విధుల్లో ఉన్న టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కూడా పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఇచ్చారు. అయితే జూలై 1, 2025 నాటికి వారి వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు. టీజీఎస్‌ఆర్టీసీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు, ఈ వయోపరిమితి సడలింపును సంస్థలో వారు పనిచేసిన సంవత్సరాల సంఖ్య వరకు పొడిగించారు, అయితే జూలై 1, 2025 నాటికి అభ్యర్థి వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.