త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు.. 30 మంది ప్ర‌యాణికుల‌కు గాయాలు

TGSRTC | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బ‌స్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 30 మంది ప్ర‌యాణికుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

S

Telangana | Published On Dec 18, 2025, 12.28 pm IST

TGSRTC | పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు.. 30 మంది ప్ర‌యాణికుల‌కు గాయాలు
Advertisement

TGSRTC | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బ‌స్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 30 మంది ప్ర‌యాణికుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు కెర‌మెరి మండ‌లం ప‌రందోలి నుంచి ఆదిలాబాద్ వైపున‌కు వెళ్తుంది. మార్గ‌మ‌ధ్య‌లో ఆర్టీసీ బ‌స్సు బ్రేకులు ఫెయిల‌య్యాయి. దీంతో బ‌స్సు డ్రైవ‌ర్ కంట్రోల్ త‌ప్పాడు. బ‌స్సు రోడ్డు ప‌క్క‌న ఉన్న ప‌త్తి చేనులోకి దూసుకెళ్లింది.

ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 40 మంది ప్ర‌యాణికులు ఉండ‌గా, 30 మందికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌క‌పోవ‌డంతో ఆర్టీసీ అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement