Mega Job Mela | హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్తులకు ఇదొక సువర్ణావకాశం. మాసబ్ ట్యాంక్‌లోని ఖాజా మాన్సన్‌లో ఈ నెల 16వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ మేరకు జాబ్ మేళా నిర్వాహకులు మన్నన్ ఖాన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. జాబ్ మేళాలో ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్‌తో పాటు పలు రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొననున్నాయి. అర్హులైన అభ్యర్థులను ఈ కంపెనీలను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. పదో తరగతి ఒరిజినల్ మార్క్స్ షీట్‌ను తప్పనిసరిగా జాబ్ మేళాకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక చేయనున్నారు. తదితర వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించొచ్చు.