TG Govt | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ.. చైర్మన్‌గా కే కేశవరావు
TG Govt | తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి త్యాగాలు, సేవలకు తగిన గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవోను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దీర్ఘకాల ఉద్యమ ఫలితంగా సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది.
TG Govt | తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి త్యాగాలు, సేవలకు తగిన గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవోను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దీర్ఘకాల ఉద్యమ ఫలితంగా సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమ సమయంలో పలువురు అమరులయ్యారని, మరికొందరు శారీరక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించింది. ఉద్యమంలో వివిధ దశల్లో పాల్గొన్న “తెలంగాణ ఉద్యమకారులను” గుర్తించి గౌరవించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నట్లు జీవోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్యమకారులను గుర్తించేందుకు, వారికి ఇవ్వాల్సిన గౌరవం, సౌకర్యాలపై సిఫార్సులు చేయేందుకు కమిటీని నియమించింది.
కమిటీ చైర్మన్‌గా సీనియర్ నేత కే కేశవరావు.. సభ్యులుగా పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ ఎం కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎం రాములు నాయక్, మోతె శోభన్‌రెడ్డిని నియమించింది. ప్రభుత్వ కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రమాణాలు రూపొందించడం, ఆ ప్రమాణాల ప్రకారం ఉద్యమకారుల జాబితా సిద్ధం చేయడం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన గౌరవం, సదుపాయాలలను సిఫారు చేసే బాధ్యతలను కమిటీకి అప్పగించింది. కమిటీ అవసరమైతే అధికారులను పిలిపించి సమాచారం సేకరించవచ్చని, సమావేశాలు నిర్వహించవచ్చని ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



