త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPSC | తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. అసిస్టెంట్ సైంటిస్టు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

TGPSC | తెలంగాణ నిరుద్యోగుల‌కు టీజీపీఎస్సీ శుభ‌వార్త వినిపించింది. చాలా రోజుల త‌ర్వాత ఉద్యోగ నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లిలో 20 అసిస్టెంట్ సైంటిస్ట్‌(అన‌లిస్ట్ గ్రేడ్‌-2) పోస్టుల భ‌ర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

S

Telangana | Published On Apr 21, 2026, 7.00 pm IST

TGPSC | తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. అసిస్టెంట్ సైంటిస్టు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్
Advertisement

TGPSC | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ నిరుద్యోగుల‌కు టీజీపీఎస్సీ శుభ‌వార్త వినిపించింది. చాలా రోజుల త‌ర్వాత ఉద్యోగ నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లిలో 20 అసిస్టెంట్ సైంటిస్ట్‌(అన‌లిస్ట్ గ్రేడ్‌-2) పోస్టుల భ‌ర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఏప్రిల్ 27 నుంచి మే 25వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌నున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించిన రాత ప‌రీక్ష‌ను 2026 జులై నెల‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీజీపీఎస్సీ వెల్ల‌డించింది.

ఓటీఆర్ త‌ర్వాతే ద‌ర‌ఖాస్తు..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ముంద‌స్తుగా త‌ప్ప‌నిస‌రిగా వ‌న్ టైమ్ రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వ‌య‌సు :

అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 34 ఏండ్లు క‌లిగి ఉండాలి.

అర్హ‌త :

బ్యాచిల‌ర్ డిగ్రీలో త‌ప్ప‌నిస‌రిగా కెమిస్ట్రీ చ‌దివి ఉండాలి. ఈ డిగ్రీ గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఉండాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://websitenew.tgpsc.gov.in/

Advertisement
Advertisement