త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPSC OTR | ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి.. త్వ‌ర‌లోనే కొత్త ఉద్యోగ నోటిఫికేష‌న్లు..!

TGPSC OTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొత్త నోటిఫికేష‌న్లు లేవు. కేవ‌లం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి మౌనంగా ఉండిపోయింది. అయితే కొత్త ఉద్యోగ నోటిఫికేష‌న్ల విడుద‌ల కోసం టీజీపీఎస్సీ( TGPSC ) క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో టీజీపీఎస్సీ నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు కీల‌క సూచ‌న చేసింది.

S

Telangana | Published On Feb 3, 2026, 8.16 am IST

TGPSC OTR | ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి.. త్వ‌ర‌లోనే కొత్త ఉద్యోగ నోటిఫికేష‌న్లు..!
Advertisement

TGPSC OTR | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొత్త నోటిఫికేష‌న్లు లేవు. కేవ‌లం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి మౌనంగా ఉండిపోయింది. అయితే కొత్త ఉద్యోగ నోటిఫికేష‌న్ల విడుద‌ల కోసం టీజీపీఎస్సీ( TGPSC ) క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో టీజీపీఎస్సీ నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు కీల‌క సూచ‌న చేసింది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌లో కీల‌క‌మైన వ‌న్‌టైమ్ రిజిస్ట్రేస‌న్( OTR ) చేసుకున్న 31.56 ల‌క్ష‌ల మంది త‌మ ఐడీ స‌హాయంతో తాజా వివ‌రాల‌ను అప్డేట్ చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. తాజా వివ‌రాల ఆధారంగానే భ‌విష్య‌త్ నియామ‌క ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తుకు చేసుకునేందుకు అర్హ‌త ల‌భిస్తుంద‌ని తెలిపింది. ఈ నెల 25 లోగా అభ్య‌ర్థులంద‌రూ అద‌న‌పు విద్యార్హ‌త‌లు, ఎస్సీలు త‌మ స‌బ్ కేట‌గిరిని అప్డేట్ చేసుకోవాల‌ని టీజీపీఎస్సీ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం స్ప‌ష్టం చేశారు.

అప్డేట్ చేసుకోవాల్సిందే ఇవే..

అద‌న‌పు అర్హ‌త‌లు
చిరునామా
ఈడ‌బ్ల్యూఎస్
నాన్ క్రిమిలేయ‌ర్ కేట‌గిరీలు
మొబైల్ నంబ‌ర్
ఈమెయిల్ ఐడీ

మార్చిలో కొత్త నోటిఫికేష‌న్‌లు

ఓటీఆర్ అప్డేట్‌కు ఫిబ్ర‌వ‌రి 25 వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు. ఇక మార్చి నెల‌లో ఉగాది కానుక‌గా కొత్త ఉద్యోగ నోటిఫికేష‌న్లు వెలువ‌డే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన జాబ్ క్యాలెండ‌ర్‌లో భాగంగా తొలుత ఇంజినీరింగ్ స‌ర్వీసుల‌తో నియామ‌క ప్ర‌క్రియ‌ను క‌మిష‌న్ ప్రారంభించ‌నుంది. ప్ర‌భుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో గుర్తించిన ఖాళీ పోస్టుల‌న్నింటినీ భ‌ర్తీ చేయ‌నుంది. ప్ర‌భుత్వ విభాగాల నుంచి అందిన ప్ర‌తిపాద‌న‌లు, రోస్ట‌ర్ ఆధారంగా క‌మిష‌న్ ఇప్ప‌టికే ప‌రిపాల‌న ప్ర‌క్రియ పూర్తి చేసింద‌ని, 500కు పైగా ఇంజినీరింగ్ పోస్టుల‌తో తొలి నోటిఫికేష‌న్ రానున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement