త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Legal Notice Eenadu | కేటీఆర్ పాస్‌పోర్ట్ వ్యవహారం: లీగల్ నోటీసుకు ‘ఈనాడు’ బదులు.. తప్పుపై వివరణ, విచారం!

ఫార్ములా-ఈ కేసులో పాస్‌పోర్ట్ జప్తు వార్తపై కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు ఈనాడు యాజమాన్యం బదులిచ్చింది. తప్పు పొరపాటున జరిగిందని విచారం వ్యక్తం చేసింది.

J

Hyderabad | Published On Oct 26, 2026, 8.44 pm IST

KTR Legal Notice Eenadu | కేటీఆర్ పాస్‌పోర్ట్ వ్యవహారం: లీగల్ నోటీసుకు ‘ఈనాడు’ బదులు.. తప్పుపై వివరణ, విచారం!

సంక్షిప్త సారాంశం

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ పాస్‌పోర్టును ఏసీబీ కోర్టు జప్తు చేయాలని ఆదేశించినట్లు వచ్చిన వార్తపై ఆయన లీగల్ నోటీసులు పంపారు. ఈ నోటీసుకు ఈనాడు న్యాయవాది ద్వారా వివరణ ఇస్తూ.. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన అభ్యర్థన మెమోను కోర్టు ఆదేశంగా పేర్కొనడం పొరపాటని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పేర్కొన్నారు. ఈ పొరపాటుపై విచారం వ్యక్తం చేస్తూ (Deeply Regretted) ఇప్పటికే పత్రికలో వివరణ ప్రచురించామని, డిజిటల్, సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ కథనాన్ని తొలగించామని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకుని ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కేటీఆర్‌కు సూచించాలని ఆయన తరఫు లాయర్‌ను కోరారు.

Advertisement

KTR Legal Notice Eenadu | త్రినేత్ర న్యూస్ : ఫార్ములా-ఈ రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పాస్‌పోర్ట్ అంశంపై ప్రచురితమైన కథనంపై ఈనాడు యాజమాన్యం స్పందించింది. కోర్టు ఆదేశాలివ్వకుండానే పాస్‌పోర్ట్ తాత్కాలిక జప్తునకు ఆదేశాలు ఇచ్చారంటూ తప్పుడు కథనం ప్రచురించారంటూ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుకు ఈనాడు తరఫు న్యాయవాది జీవీఎస్ జగన్నాథరావు లిఖితపూర్వక సమాధానం పంపారు.

సెప్టెంబరు 29న ప్రచురితమైన ఆ కథనంలో దొర్లిన తప్పు పూర్తిగా అనుకోకుండా, పొరపాటున జరిగిందే తప్ప కేటీఆర్‌ను కించపరచాలనే దురుద్దేశం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.

నోటీసులో ఈనాడు పేర్కొన్న కీలక అంశాలు

ఈనాడు న్యాయవాది ఇచ్చిన సమాధానం ప్రకారం.. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైదరాబాద్‌లోని స్పెషల్ ఏసీబీ కోర్టులో కేటీఆర్‌తో పాటు ఇతరుల పాస్‌పోర్టులపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేవలం మెమో మాత్రమే దాఖలు చేశారు. అయితే, ఆ మెమోను కోర్టు జారీ చేసిన 'తాత్కాలిక జప్తు ఆదేశం'గా రిపోర్ట్ చేయడంలో పొరపాటు దొర్లిందని అంగీకరించారు.

ఈ పొరపాటు ఏమాత్రం ఉద్దేశపూర్వకమైనది కాదని, దీనిపై తీవ్ర విచారం (Deeply Regretted) వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ప్రజల హక్కు, సమాచార వ్యాప్తి దృష్ట్యా ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విషయాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ కోణంలో సాధారణ విధి నిర్వహణలో భాగంగానే రిపోర్టర్ అందించారని వివరించారు.

డిజిటల్ ప్లాట్‌ఫారాల నుంచి కథనం డిలీట్.. పత్రికలో వివరణ

కేటీఆర్ తరఫు న్యాయవాది లలితారెడ్డి నుంచి నోటీసు అందిన వెంటనే.. ఈనాడుకు చెందిన అన్ని డిజిటల్, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సదరు కథనానికి సంబంధించిన లింకులు, పోస్టులను పూర్తిగా తొలగించినట్లు న్యాయవాది తెలిపారు.

అంతేకాకుండా, అక్టోబర్ 7వ తేదీ నాటి హైదరాబాద్ మెయిన్ ఎడిషన్‌లో 'కేటీఆర్ పాస్‌పోర్టుపై కోర్టు ఆదేశాలివ్వలేదు' అనే శీర్షికతో అధికారికంగా వివరణ (Clarification) కూడా ప్రచురించినట్లు గుర్తుచేశారు. ఆ వివరణ క్లిప్పింగ్‌ను కూడా సమాధానంతో జతచేశారు.

తమ సద్భావన (Bona fides)ను పరిగణనలోకి తీసుకుని, ఇప్పటికే పత్రికలో వివరణ ఇచ్చినందున ఈ వ్యవహారానికి ఇంతటితో ముగింపు పలకాలని (Give quietus to the issue) కేటీఆర్‌కు సూచించాలని ఆయన తరఫు లాయర్‌ను ఈనాడు న్యాయవాది కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement