త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather Update | తెలంగాణ‌లో తీవ్ర‌మైన వ‌డ‌గాలులు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

TG Weather Update | తెలంగాణ‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ‌త్ర‌లు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు గ‌రిష్టానికి చేరుతున్నాయి.

P

Telangana | Published On May 25, 2026, 3.46 pm IST

TG Weather Update | తెలంగాణ‌లో తీవ్ర‌మైన వ‌డ‌గాలులు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Advertisement

TG Weather Update | తెలంగాణ‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ‌త్ర‌లు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు గ‌రిష్టానికి చేరుతున్నాయి. ఈ క్ర‌మంలో వాతావ‌ర‌ణ‌శాఖ కీల‌క హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాగల ఐదురోజులు రాష్ట్రంలో తీవ్ర‌మైన వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాల‌కు రెడ్‌, అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సోమ‌వారం పెద్ద‌ప‌ల్లి, భూపాల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో తీవ్ర‌మైన వ‌డ‌గాలులు వ‌చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ జిల్లాల్ల‌లో వేడిగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్‌ను ప్ర‌క‌టించింది. అలాగే, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల, జ‌న‌గాం జిల్లాల్లోనూ వేడి ప‌రిస్థితులుంటాయ‌ని హెచ్చ‌రించింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, హైద‌రాబాద్‌, మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో రాత్రిళ్లు సైతం వేడి ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది.

మంగ‌ళ‌వారం భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లోనూ తీవ్ర‌మైన వ‌డ‌గాలులు ఉంటాయ‌ని తెలిపింది. ఆయా జిల్లాల‌కు రెడ్ అలెర్ట్అ, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ జిల్లాల‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, జ‌న‌గాంలో వ‌డ‌గాలులు కొన‌సాగుతాయ‌ని పేర్కొంది. అలాగే, బుధ‌, గురువారాల్లో మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జిల్లాల్లో వ‌డ‌గాలులు వీస్తాయ‌ని పేర్కొంది. ఉత్త‌ర తెలంగాణ‌తో పాటు ప‌లు జిల్లాల్లు ఉరుములు, మెరుపుల‌తో పాటు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హెచ్చ‌రించింది. తీవ్ర‌మైన వ‌డ‌గాలుల నేప‌థ్యంలో జ‌నం ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు సూచిస్తున్నారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని, త‌రుచుగా నీళ్లు, కొబ్బ‌రినీళ్లు, పండ్ల ర‌సాలు తీసుకుంటూ ఉండాల‌ని చెబుతున్నారు.

 

Advertisement
Advertisement