TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం..! తెలంగాణలో రెండురోజులు వానలే..|
TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఈ మేరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఈ మేరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మన్నార్ గల్ఫ్‌తో పాటు దాని సమీపంలోని శ్రీలంక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసాగుతోందని, ఇది మరింత బలపడితే అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.
సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ద్రోణి ఈశాన్య బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర మధ్య ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరశాఖ అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా.. రాగల రెండురోజుల్లో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ శాఖ వివరించింది. రాబోయే రెండురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులుండవని తెలిపింది.
ఆ తర్వాత రాగల రోజులు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



