త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో అప్ప‌టి దాకా వాన‌లే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!

TG Weather | తెలంగాణ‌లో ఈ నెల 23 వ‌ర‌కు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్లు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

P

Telangana | Published On Mar 16, 2026, 8.07 pm IST

TG Weather | తెలంగాణ‌లో అప్ప‌టి దాకా వాన‌లే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
Advertisement

TG Weather | తెలంగాణ‌లో ఈ నెల 23 వ‌ర‌కు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్లు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. త‌మిళ‌నాడు నుంచి కొమోరిన్ ప్రాంతం వ‌ర‌కు, ఇంటీరియ‌ర్ క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు మీదుగా స‌గ‌టు స‌ముద్ర‌మ‌ట్టానికి 0.9 కిలోమీట‌ర్ల ఎత్తులో ఆవ‌ర్త‌నం కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. ఉత్త‌ర తీర ప్రాంత త‌మిళ‌నాడుపై స‌గ‌టు స‌ముద్ర‌మ‌ట్టానికి 1.5 కిలోమీట‌ర్ల ఎత్తులో ఆవ‌ర్తనం ఉంద‌ని వివ‌రించింది.

ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హబూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపులుల‌తో వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. బుధ‌, గురువారాల్లో ప‌లుచోట్ల గంట‌కు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వాన‌లు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. 20న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగల్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేసింది. శ‌ని, ఆదివారాల్లో ప‌లుచోట్ల తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Advertisement
Advertisement