TG Weather | తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..
TG Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. వారం రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
TG Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. వారం రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల రెండురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఆ తర్వాత రెండు నుంచి మూడు డిగ్రీలు క్రమంగా తగ్గుతాయని పేర్కొంది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
సోమవారం గంటకు 30 నుంచి 40 మీటర్ల వేగంతో గాలులు వీస్తూ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు పడుతాయని అంచనా వేసింది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండలో భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే, బుధవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. అలాగే, గురువారం నుంచి శనివారం వరకు పలుచోట్ల భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కొనసాగుతాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



