TG Weather | వాతావరణశాఖ గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఐదురోజులు భారీ వర్షాలు
TG Weather | ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉన్నది.
TG Weather | ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉన్నది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
సంబంధిత వార్తలు

Hyderabad Liberation Day 2026 | బైరాన్పల్లి, నిర్మల్లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు
సెప్టెంబర్ 17, 2026

NTA Examination Calendar | జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్-1.. వివిధ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ
సెప్టెంబర్ 17, 2026

Prithvi Shaw | పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●నిజాం కోటను కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం.. కరాచీ టూ హైదరాబాద్ సీక్రెట్ ఫ్లైట్ కథ!
- ●PM Modi | ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు స్పెషల్.. రక్తదానం చేసిన సీఎం
- ●Anthropic | మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు ఆంథ్రోపిక్ పోటీ.. క్లాడ్లోనే డాక్యుమెంట్లు..
- ●Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్
- ●Special Trains | ప్రయాణికులకు తీపికబురు..! పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Amazon Alexa Plus | అమెజాన్ నుంచి అలెక్సా ప్లస్.. ఇక మీ మాటే ఆదేశం..

నిజాం కోటను కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం.. కరాచీ టూ హైదరాబాద్ సీక్రెట్ ఫ్లైట్ కథ!

PM Modi | ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు స్పెషల్.. రక్తదానం చేసిన సీఎం

Anthropic | మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు ఆంథ్రోపిక్ పోటీ.. క్లాడ్లోనే డాక్యుమెంట్లు..

Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్



