TG TET | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జనవరి 3వ తేదీ నుంచి 20 వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేశారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు దరఖాస్తుదారుని జర్నల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ తప్పనిసరి. టెట్ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటలకు వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్‌లో పరీక్షలు ఉంటాయి. జనవరి 3న పేపర్-2 గణితం, సైన్స్ పేపర్‌తో పరీక్షలు ప్రారంభమై.. జనవరి 20న పేపర్-2 (మైనర్), గణితం, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ పేపర్లతో ముగుస్తాయి. టెట్ హాల్ టికెట్ల కోసం ఈ వెబ్‌సైట్ లింక్‌ను https://tgtet.aptonline.in/tgtet/ క్లిక్ చేయండి.